Anjali Ryot : డ్రగ్స్ ముఠా కాల్పుల్లో భారత సంతతి టెక్కీ మృతి

డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత సంతతి టెక్కీ మృతి చెందింది. ఈ ఘటన మెక్సికోలోని తులుమ్‌‌లో జరిగింది.

Anjali Ryot : డ్రగ్స్ ముఠా కాల్పుల్లో భారత సంతతి టెక్కీ మృతి

Anjali Ryot

Updated On : October 24, 2021 / 11:15 AM IST

Anjali Ryot :  డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత సంతతి టెక్కీ మృతి చెందింది. ఈ ఘటన మెక్సికోలోని తులుమ్‌‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన అంజలి రయోత్, భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో నివసిస్తున్నారు. గతంలో యాహూలో పనిచేసిన అంజలి జులైలో లింక్డ్‌ఇన్‌లో సీనియర్ సైట్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యారు. ఇక ఈ నెల 22న ఆమె జన్మదినం ఉండటంతో వేడుకలు చేసుకునేందుకు భర్తతో కలిసి 20తేదీ మెక్సికో వెళ్ళింది.

చదవండి : Missing boy died: అనీశ్ కథ విషాదాంతం.. హైదర్ గూడలో అదృశ్యమైన బాలుడు మృతి..!

బుధవారం రాత్రి 10:30 గంటలకు అంజలి, మరో నలుగురు పర్యాటకులు లా మల్క్వెరిడా రెస్టారెంట్ టెర్రస్‌పై భోజనం చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన డ్రగ్స్ ముఠా, పక్క టేబుల్ పై ఉన్న మరో డ్రగ్స్ ముఠాపై కాల్పులు జరిపింది. దీంతో అక్కడ ఇరు ముఠాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అంజలికి బులెట్ తగలడంతో ఆమె అక్కడిక్కకడే మృతి చెందింది… ఈ ఘటనలో జర్మనీ టూరిస్ట్‌ జెన్నిఫర్ హెంజోల్డ్ కూడా మరణించారు.

చదవండి : Selfie Pose Gorilla Ndakasi died : కాపాడినోడి కౌగిలిలోనే కన్నుమూసిన ‘సెల్ఫీ స్టార్ గొరిల్లా’

జర్మనీ, నెదర్లాండ్స్‌కు చెందిన మరో ముగ్గురు పర్యాటకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అంజలి భర్తకు కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అంజలి భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవ ఆమె మరణం వార్తను హిమాచల్‌ ప్రదేశ్‌ సోలన్‌లోని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.