లయన్ జెట్ క్రాష్ ‘క్లూ’ : ఆ బ్లాక్ బాక్సుల్లో ఏముంది?
గత ఏడాది ఇండోనేషియాలో సముద్రంలో ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ జెట్ ఘటనపై పురోగతి లభించింది. ప్రమాదానికి సంబంధించి విమాన శకలాల్లో కాక్ పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్టు అధికారులు వెల్లడించారు.

గత ఏడాది ఇండోనేషియాలో సముద్రంలో ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ జెట్ ఘటనపై పురోగతి లభించింది. ప్రమాదానికి సంబంధించి విమాన శకలాల్లో కాక్ పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్టు అధికారులు వెల్లడించారు.
జకార్తా: గత ఏడాది ఇండోనేషియాలో సముద్రంలో ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ జెట్ ఘటనపై పురోగతి లభించింది. ప్రమాదానికి సంబంధించి విమాన శకలాల్లో కాక్ పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్టు అధికారులు వెల్లడించారు. విమానంలో రెండు బ్లాక్ బాక్సులను గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ 29న జావా సముద్రంలో లయన్ ఎయిర్ జెట్ (బోయింగ్ 737 మ్యాక్స్ 8) విమానం ప్రమాదానికి గురైంది. జకార్తా నుంచి టేకాఫ్ కొద్ది క్షణాల్లోనే జెట్ విమానం సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 189 మంది దుర్మరణం చెందారు. అప్పటి నుంచి ఇండోనేషియా నేవీ గజ ఈతగాళ్లు ఎయిర్ జెట్ విమానానికి సంబంధించి సముద్ర జాలల్లో విస్తృతంగా జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఎయిర్ జెట్ శకలాలను బయటకు తీసి నిశితంగా పరీక్షించారు. అందులో కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎన్టీఎస్ కమిటీ సంబంధిత అధికారులకు సమాచారం అందించింది.
ఈ క్లూతో ప్రమాద సమయంలో పైలట్లు, కో పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య జరిగిన సంభాషణంతా రికార్డు అయినట్టు అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాక ఏం జరిగిందో ఏదైనా క్లూ దొరికే చాన్స్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో నిక్షిప్తమైన ఎఫ్ ఢీఆర్ డీటాను రికవర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. బ్లాక్ బాక్సుల్లో మెమెరీ చిప్ ఉంటుంది. ఫ్లైట్ డేటాను ఇదే రికార్డు చేస్తుంది. ఈ ఎఫ్డీఆర్ 25 గంటల పాటు విమానం డేటాను రికార్డు చేస్తుంది. 25 గంటల తరువాత ఓల్డ్ రికార్డుపైనే కొత్త విమానం డేటా రికార్డు అవుతుందని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.