హైటెన్షన్.. ఎదురుదాడికి దిగిన హెజ్బొల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం..

హెజ్బొల్లా, హమాస్‌పై ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించదని ఖమేనీ తేల్చి చెప్పారు.

హైటెన్షన్.. ఎదురుదాడికి దిగిన హెజ్బొల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం..

Israel Hezbollah War Updates (Photo Credit : Google

Updated On : October 5, 2024 / 5:15 PM IST

Israel Hezbollah War Updates : లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్లలో హైటెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్ సైన్యం క్షిపణుల దాడులతో విరుచుకుపడుతోంది. బీరుట్ లోని భవనాలు కంపించిపోతున్నాయి. గత 20 రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 1400 మందికిపైగా లెబనాన్ వాసులు చనిపోయారు. మరో 12 లక్షల మందికి పైగా నిర్వాసితులై శరణార్దులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా బీరుట్ కు 50 కిలోమీటర్ల దూరంలోని లెబనాన్-సిరియా-మాసినా బోర్డర్ క్రాసింగ్ ను మూసివేశారు.

ఇటు హెజ్బొల్లా కూడా తగ్గేదేలే అంటోంది. అర్ధరాత్రి నుంచి పెద్దఎత్తున ప్రతి దాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్ పై భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. దీంతో లోయర్ తదితర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. పలు చోట్ల మంటలు చెలరేగాయి. భూతల దాడుల్లో మరో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు సైన్యం ధృవీకరించింది. మరోవైపు గాజాపైన దాడులను తీవ్రతను పెంచింది ఇజ్రాయెల్. ఓ స్కూల్ భవనంపై జరిగిన దాడిలో పలువురు చిన్నారులు బలైనట్లుగా తెలుస్తోంది.

హెజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లాకు వారసుడిగా విస్తృతంగా పరిగణించబడుతున్న అగ్రశ్రేణి హిజ్బుల్లా అధికారి హషేమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకుని బీరుట్ శివార్లలో దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కీలక బహిరంగ ఉపన్యాసం చేశారు. హిజ్బొల్లా, హమాస్‌పై ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించదని ఖమేనీ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడిని ఆయన సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్ పై ఇస్లామిక్ రిపబ్లిక్ క్షిపణి దాడి “చట్టబద్ధమైనది”గా ఆయన అభివర్ణించారు. ఇజ్రాయెల్ చేసిన “నేరాలకు” కనీస శిక్ష అని ఖమేనీ అన్నారు.

Also Read : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 30ఏళ్ల స్నేహం ఎందుకు చెడింది? ఈస్థాయిలో శత్రుత్వానికి కారణమేంటి?