Israeli Airstrikes: బాంబుల వర్షం, 100 మంది మృతి.. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు..
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘోరమైన వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడిలో వందల మంది చనిపోతున్నారు.

Israeli Airstrikes: ఇజ్రాయెల్ తగ్గేదేలే అంటోంది. గాజాపై దాడులను కంటిన్యూ చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాలో రక్తపు టేరులు పారిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 100 మంది మరణించారు. గాజా స్ట్రిప్ అంతటా వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. రాత్రిపూట జరిగిన ఈ దాడిలో కనీసం 100 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.
కాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. గురువారం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడిలో వందలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 100 మంది అమరులయ్యారు. అనేక కుటుంబాలు చిన్నాభిన్నాం అయ్యాయి. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది అని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
బందీలను విడిపించేలా హమాస్‌పై ఒత్తిడి తేవడానికి మార్చి ప్రారంభం నుండి గాజాలోకి వైద్య, ఆహారం, ఇంధన సరఫరాలను ఇజ్రాయెల్ నిరోధించింది. మొత్తం గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకోవడం, సహాయాన్ని నియంత్రించడం వంటి ప్రణాళికలు రచించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ప్రతిగా బందీలను మాత్రమే విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. అమెరికా మద్దతుతో ఈజిప్ట్, ఖతార్ కు చెందిన మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: ఇది డొనాల్డ్ ట్రంప్ వర్షన్ “బిగ్ బాస్” షో.. టీవీ షోలో గెలిస్తే అమెరికా పౌరసత్వం
దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లో నిరాశ్రయులైన కుటుంబాలు నివసించే ఒక టెంట్ శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక జరిపిన దాడిలో కనీసం 24 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు. మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొత్త రౌండ్ చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ సైనిక దాడిని విస్తరించింది. బాంబుల వర్షం కురిపిస్తోంది. గత 72 గంటల్లో వందలాది మందిని బలిగొంది. తాజా దాడిలో మహిళలు, పిల్లలు కూడా మరణించారని, డజన్ల కొద్దీ ఇతర వ్యక్తులు గాయపడ్డారని, అనేక టెంట్లు తగలబడిపోయాయని గాజా అధికారులు వెల్లడించారు.
”ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘోరమైన వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో వందల మంది చనిపోతున్నారు. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లో నిరాశ్రయులైన కుటుంబాలు ఉన్న శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 100 మంది పాలస్తీనియన్లు మరణించారు” అని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఉత్తర గాజాలోని ప్రధాన ఆసుపత్రిని బలవంతంగా మూసివేయాల్సి వచ్చిందని వాపోయారు.
గాజాలో రక్తం ఏరులై పారుతోంది. ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడుల్లో పాలస్తీనీయులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. వందలాది మంది గాయపడుతున్నారు. మార్చి నెలలో కాల్పుల విరమణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. హమాస్ ను పూర్తిగా నాశనం చేసే వరకు వదిలేది లేదని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. దాదాపు 20 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంతో గాజా అల్లాడిపోతోంది. సీజ్ ఫైర్ ముగిశాక ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఊహించని రీతిలో పెంచేసింది.
”ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో.. గాజా ఉత్తర ప్రాంతంలో ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాన ఆసుపత్రిని మూసివేయాల్సి వచ్చింది. యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతంలో పని చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇండోనేషియా ఆసుపత్రి చివరి ప్రభుత్వ ఆసుపత్రి. ఉత్తర గాజాలోని మరో ప్రధాన ఆసుపత్రి కమల్ అద్వాన్ ను. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గత సంవత్సరం ఇది కూడా మూసివేయాల్సి వచ్చింది” అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.