Japan Earthquake : జపాన్ భూకంపం…62కు పెరిగిన మృతుల సంఖ్య, మరిన్ని భూకంపాలు సంభవిస్తాయని అధికారుల హెచ్చరికలు

జపాన్ దేశంలో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 62కు పెరిగింది. జపాన్ దేశంలో మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది....

Japan Earthquake : జపాన్ భూకంపం…62కు పెరిగిన మృతుల సంఖ్య, మరిన్ని భూకంపాలు సంభవిస్తాయని అధికారుల హెచ్చరికలు

Japan Earthquake

Japan Earthquake : జపాన్ దేశంలో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 62కు పెరిగింది. జపాన్ దేశంలో మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది. దీనివల్ల భవనాలు కూలిపోయాయి. తూర్పు రష్యా వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా జపాన్‌లోని వాజిమా సిటీలో పలు ఇళ్లు, 25 భవనాలు కూలిపోయాయి.

ALSO READ : Cold Wave : ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలిగాలులు…నాలుగు రోజులపాటు స్కూళ్లకు సెలవులు

శక్తివంతమైన భూకంపం తర్వాత కొండచరియలు విరిగిపడడం, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సంభవించిన భూకంపం తర్వాత మీటరు కంటే ఎక్కువ ఎత్తులో సునామీ తరంగాలు వచ్చాయి. మంటలు చెలరేగడంతోపాటు పలు రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పం చాలా తీవ్రంగా దెబ్బతింది, అనేక వందల భవనాలు అగ్నిప్రమాదంతో ధ్వంసమయ్యాయి.

ALSO READ : Truckers : కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం…డ్రైవర్ల సమ్మె విరమణ

వాజిమా, సుజుతో సహా అనేక పట్టణాలలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బుధవారం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో భూకంపం నష్టం వెలుగుచూసింది. ఈ భూకంపం వల్ల 62 మంది మరణించారని, మరో 300 మందికి పైగా గాయపడ్డారని, వారిలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని జపాన్ ప్రాంతీయ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 31,800 మందికి పైగా ప్రజలు ఆశ్రయాల్లో ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.

ALSO READ : Gold Price Today : కొత్తేడాదిలో పరుగు మొదలెట్టిన బంగారం ధర.. తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?

స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర కార్యాచరణ విభాగాల ద్వారా రెస్క్యూ ప్రయత్నాలు చేస్తున్నారు. జపాన్ వాతావరణ సంస్థ భూకంపం వచ్చిన ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. ఇషికావా ప్రిఫెక్చర్‌లో 34,000 గృహాలకు ఇప్పటికీ విద్యుత్తు సరఫరా లేదు. జపాన్ దేశంలో ప్రతి సంవత్సరం వందలాది భూకంపాలు వస్తున్నాయి.