Khalistani Terrorist : పాకిస్తాన్ లో ఖలిస్థానీ ఉగ్రవాది లఖ్ బీర్ సింగ్ రోడే మృతి

సిక్కు ఆచార సంప్రదాయాలను అనుసరించి పాకిస్థాన్ లో నే రోడే అంత్యక్రియలు రహస్యంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.

Khalistani Terrorist : పాకిస్తాన్ లో ఖలిస్థానీ ఉగ్రవాది లఖ్ బీర్ సింగ్ రోడే మృతి

Terrorist Lakhbir Singh Rode

Updated On : December 5, 2023 / 1:51 PM IST

Khalistani Terrorist Died : పాకిస్తాన్ లో ఖలిస్థానీ ఉగ్రవాది లఖ్ బీర్ సింగ్ రోడే మృతి చెందారు. పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న రోడే డిసెంబర్ 2వ తేదీన గుండెపోటుతో మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిక్కు ఆచార సంప్రదాయాలను అనుసరించి పాకిస్థాన్ లో నే రోడే అంత్యక్రియలు రహస్యంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.

పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే మేనల్లుడు లఖ్ బీర్ సింగ్ రోడే. ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ సంస్థలకు రోడే చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. భారత ప్రభుత్వం గతంలోనే రోడేని ఉగ్రవాదిగా ప్రకటించింది.

Thailand : చెట్టును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. 14మంది దుర్మరణం