బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్.. కారణం కోహినూర్ శాపమేనా?

కోహినూర్‌ను కలిగి ఉండడాన్ని హోదాగా భావించిన రాజ్యాలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. బ్రిటన్ రాజవంశానికి చేరిన తర్వాత మహారాణులే దానిని ధరించారు. ఇప్పుడే అది వారసత్వంగా కింగ్ చార్లెస్‌కు అందింది. ఇన్నాళ్లూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న 75ఏళ్ల కింగ్ చార్లెస్ కోహినూర్‌ శాపంతోనే ఇలా హఠాత్తుగా క్యాన్సర్ బారిన పడ్డారనే ప్రచారం సాగుతోంది.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్.. కారణం కోహినూర్ శాపమేనా?

Kohinoor Diamond Curse

Kohinoor Curse : కోహినూర్ శాపం కొనసాగుతోందా..? అందుకే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ క్యాన్సర్ బారిన పడ్డారా..? రాజుగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లయినా గడవకముందే.. కింగ్ చార్లెస్ క్యాన్సర్ బారిన పడడంతో ఇది.. కోహినూర్ ప్రభావమేనని ప్రచారం జరుగుతోంది. కాకతీయుల నుంచి ఖిల్జీలు, ఈస్టిండియా కంపెనీ దాకా ఎన్నో రాజ్యాలు కుప్పకూలడానికి.. చక్రవర్తుల హత్యలకు, మరణాలకు కోహినూరే కారణమన్న నమ్మకం ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు ఆ మేలిమి వజ్రానికి అధిపతిగా ఉన్న చార్లెస్ రాజయిన కొద్దికాలానికే క్యాన్సర్ బారిన పడడం సంచలనంగా మారింది.

కోహినూర్ ప్రభావమేనని చర్చ..
కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్ ఉన్నట్టు బకింగ్‌ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కింగ్ చార్లెస్‌కు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్టు తేలిందని ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని తెలిపింది. కింగ్ చార్లెస్ కు ఏ శరీర భాగానికి క్యాన్సర్‌ సోకిందో తెలియదు కానీ.. ఈ వార్త బైటకు వచ్చిన దగ్గరి నుంచి అది కోహినూర్‌ ప్రభావమేనన్న చర్చ భారత్, బ్రిటన్‌తో పాటు విదేశీ మీడియాలో జోరుగా సాగుతోంది.

బ్రిటన్ రాజ కుటుంబం ఆస్తిలో భాగమైపోయిన కోహినూర్ వజ్రం..
క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2002 సెప్టెంబర్ 8న 73 ఏళ్ల వయసులో చార్లెస్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది మే6న పట్టాభిషేకం జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ నుంచి వారసత్వంగా కింగ్ చార్లెస్‌కు కోహినూర్ అందింది. భారత్ అలనాటి వైభవానికి ప్రతీక అయిన కోహినూర్ వజ్రం దాదాపు రెండు శతాబ్దాలుగా బ్రిటన్ రాజకుంటుంబం చేతిలోనే ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి క్వీన్ విక్టోరియాకు చేరిన కోహినూర్.. బ్రిటన్ రాజ కుటుంబం ఆస్తిలో భాగమైపోయింది.

కోహినూర్‌ శాపంతోనే.. హఠాత్తుగా క్యాన్సర్ బారిన పడ్డారనే ప్రచారం..
కాకతీయుల పాలనలో గుంటూరు జిల్లాలో దొరికిన కోహినూరు వజ్రం ప్రాంతాలు, దేశాలు, ఖండాలను దాటి ప్రయాణించింది. రకరకాల రాజ్యాల, రాజుల చేతులు మారుతూ చివరకు బ్రిటన్ రాజవంశం దగ్గరకు చేరి.. అక్కడే ఆగిపోయింది. అయితే ఈ ప్రయాణంలో కోహినూర్.. తననదుకున్న వారినందరినీ శాపగ్రస్తులుగా మార్చిందనే ప్రచారం ఉంది.

ఖిల్జీ నుంచి సిక్కుల సామ్రాజ్యం దాకా, ఆ తర్వాత ఈస్టిండియా పాలనా కుప్పకూలడానికి కోహినూరే కారణమన్నది చాలా మంది నమ్మకం. కోహినూర్‌ను కలిగి ఉండడాన్ని హోదాగా భావించిన రాజ్యాలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. బ్రిటన్ రాజవంశానికి చేరిన తర్వాత మహారాణులే దానిని ధరించారు. ఇప్పుడే అది వారసత్వంగా కింగ్ చార్లెస్‌కు అందింది. ఇన్నాళ్లూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న 75ఏళ్ల కింగ్ చార్లెస్ కోహినూర్‌ శాపంతోనే ఇలా హఠాత్తుగా క్యాన్సర్ బారిన పడ్డారనే ప్రచారం సాగుతోంది.