Olympic Games: LA28 ఒలింపిక్, పారాలింపిక్స్ క్రీడల ప్రారంభ తేదీలు ఖరారు

లాస్ ఏంజిల్స్ 2028(LA28) వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు మెగా ఈవెంట్ కు సంబంధించి ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. 14 జూలై 2028న LA28 ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందని, గేమ్స్ 2028 జూలై 30వరకు జరుగుతాయని ఐదుసార్లు ఒలింపిక్ పతక విజేత, LA28 చీఫ్ అథ్లెట్ ఆఫీసర్ జానెట్ ఎవాన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా LA28 పారాలింపిక్ గేమ్‌లు 2028 ఆగస్టు 15న ప్రారంభమవుతాయని, ఆగస్టు 27న ముగుస్తాయని అన్నారు.

Olympic Games: LA28 ఒలింపిక్, పారాలింపిక్స్ క్రీడల ప్రారంభ తేదీలు ఖరారు

Olympic Games

Updated On : July 19, 2022 / 4:50 PM IST

Olympic Games: లాస్ ఏంజిల్స్ 2028(LA28) వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు మెగా ఈవెంట్ కు సంబంధించి ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. 14 జూలై 2028న LA28 ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందని, గేమ్స్ 2028 జూలై 30వరకు జరుగుతాయని ఐదుసార్లు ఒలింపిక్ పతక విజేత, LA28 చీఫ్ అథ్లెట్ ఆఫీసర్ జానెట్ ఎవాన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా LA28 పారాలింపిక్ గేమ్‌లు 2028 ఆగస్టు 15న ప్రారంభమవుతాయని, ఆగస్టు 27న ముగుస్తాయని అన్నారు. LA28 గేమ్‌లు ఇతర క్రీడలకు భిన్నంగా ఉంటాయని, దక్షిణ కాలిఫోర్నియాలోని అత్యుత్తమ స్టేడియాలు, ప్రపంచ స్థాయి సంస్కృతిని క్రీడాకారులు, అభిమానులు ప్రదర్శిస్తారని అన్నారు.

2032 Olympic Games : బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్ గేమ్స్‌

ప్రతి క్రీడాకారుడు LA28లో ఆడటాన్ని నిజం చేసుకొనేందుకు కలలు కంటారని అన్నారు. LA (లాస్ ఏంజిల్స్) అనేది అంతులేని అవకాశాలతో కూడిన ప్రతిష్టాత్మక నగరం. ఆటలు మన సమాజాన్ని ప్రతిబింబిస్తాయని LA28 చైర్‌పర్సన్ కేసీ వాసెర్‌మాన్ ప్రకటనలో తెలిపారు. లాస్ ఏంజిల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి సరైన నేపథ్యాన్ని అందిస్తుందని తెలిపారు. LA28 గేమ్‌లు లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రపంచ స్థాయి స్టేడియాలను ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. LA28 గేమ్‌లు 40 కంటే ఎక్కువ క్రీడలలో 800 ఈవెంట్‌లలో 3,000 గంటల కంటే ఎక్కువ లైవ్ స్పోర్ట్‌లను కలిగి ఉంటాయని, LA 28 ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలలో 15,000 మంది అథ్లెట్లు పోటీ పడతారని అంచనా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) 2017 సెప్టెంబర్ 13న పెరూలోని లిమాలో ప్రకటించిందని, పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తుందని, 2028ని లాస్ ఏంజెల్స్‌కు ఇచ్చిందని అన్నారు. 1900-1924లో ప్యారిస్ ఆటలకు ఆతిథ్యమివ్వగా, 1932-1984లో లాస్ ఏంజెల్స్ ఆతిథ్యమివ్వడంతో IOC నిర్ణయంతో రెండు నగరాలను మూడుసార్లు సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలాఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్, IOC సభ్యుడు, LA28 కోఆర్డినేషన్ కమిషన్ చైర్ నికోల్ హోవెర్ట్జ్ LA28 యొక్క ప్రణాళికను సమీక్షించడానికి లాస్ ఏంజిల్స్‌ను సందర్శించినందున LA28 ఆటల తేదీల ప్రకటన వచ్చింది.