Ukrainian Soldier Live Grenade : యుక్రెయిన్ సైనికుడి గుండెల్లో చిక్కుకున్న లైవ్ గ్రనేడ్‌ను తొలగించిన డాక్టర్లు

యుక్రెయిన్ డాక్టర్ అరుదైన సర్జీరీ చేశారు. యుక్రెయిన్ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడికి ఛాతీలోకి దూసుకెళ్లిన లైవ్‌ గ్రనేడ్‌ను మిలటరీ ఓ డాక్టర్ ధైర్యంగా ఆపరేషన్ చేసిన లైవ్ గ్రనేడ్ ను తొలగించారు.

Ukrainian Soldier Live Grenade : యుక్రెయిన్ సైనికుడి గుండెల్లో చిక్కుకున్న లైవ్ గ్రనేడ్‌ను తొలగించిన డాక్టర్లు

Live grenade removed from Ukrainian soldier's chest

Updated On : January 13, 2023 / 5:01 PM IST

Live grenade removed from Ukrainian soldier’s chest : యుక్రెయిన్ అంటే యుద్ధమే గుర్తుకొస్తుంది. కానీ యుక్రెయిన్ లో డాక్టర్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఓ సైనికుడికి ఆపరేషన్ చేశారు. యుక్రెయిన్ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడికి ఛాతీలోకి దూసుకెళ్లిన లైవ్‌ గ్రనేడ్‌ను మిలటరీ ఓ డాక్టర్ ధైర్యంగా ఆపరేషన్ చేసిన లైవ్ గ్రనేడ్ ను తొలగించారు. సర్జరీ చేసే సమయంలో అది పేలితే సదరు సైనికుడితో పాటు డాక్టర్ కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయినా ధైర్యం చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి విజయంవంతంగా అత్యంత చాకచక్యంగా ఆ గ్రనేడ్ ను తొలగించారు ఆండ్రీ వెర్బా అనే మిలటరీ డాక్టర్.

ప్రస్తుతం సైనికుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు డాక్టర్. ఈ సర్జరీ చేసే సమయంలో ఏమాత్రం చిన్నపాటి పొరపాటు జరిగినా ఆ లైవ్ గ్రనేడ్ పేలిపోయే ప్రమాదముంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ ఆండ్రీ వెర్చా ధైర్యం చేశారు.విజయంతంగా సర్జరీ పూర్తి చేశారు. ఈ అరుదైన ఆపరేషన్ మెడికల్ పుస్తకాల్లో చేర్చాలని యుక్రెయిన్ భావిస్తోంది. “డాక్టర్ ఆండ్రీ వెర్చా అత్యంత అనుభవజ్ఞులైన సర్జన్‌ అని అభివర్ణించాయి యుక్రెయిన్ సాయుధ దళాలు.

ఆ లైవ్ గ్రనేడ్ ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదం ఉందని తెలిసినా.. వైద్యం అందించేందుకు ఆర్మీ డాక్టర్ ఆండ్రీ వెర్బా ముందుకొచ్చారు. ఇద్దరు సైనికుల సాయంతో- గ్రనేడ్‌ పేలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే అత్యంత చాకచక్యంగా శస్త్రచికిత్సను పూర్తిచేశారు. గ్రనేడ్‌ను విజయవంతంగా తొలగించారు. కాగా ఆ లైవ్ గ్రనేడ్ అతని గుండెలకు ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకుందో మాత్రం వెల్లడించలేదు.