విద్యార్థుల కోసం రూ. 15 కోట్లు ఖర్చుతో ‘లాలీపాప్’ కొన్న మంత్రిపై వేటు..!

కొవిడ్-19కు రెమిడీగా విద్యార్థులను తప్పక మాస్క్ ధరించాలని, హెర్బల్ టీ తాగాలని అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. అయితే విద్యార్థులు ప్రతిరోజు చేదుగా ఉండే హెర్బల్ టీ తాగలేరని భావించిన Madagascar విద్యాశాఖ మంత్రి పిల్లల కోసం స్వీట్లను కొనేందుకు ప్లాన్ ప్రకటించారు. ప్రత్యేకించి పిల్లల కోసం క్యాడీస్ కొనేందుకు రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. దీంతో అక్కడి ప్రభుత్వం మంత్రిపై వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తుంటే.. హిందు మహా సముద్రంలోని సౌతరన్ అఫ్రికన్ ద్వీపమైన Madagascar మాత్రం కరోనాపై పోరాడేందుకు మరో ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టింది.
ఏప్రిల్ 21న మడగాస్కర్ అధ్యక్షులు Andry Rajoelina కరోనా వైరస్‌ను నయం చేసే స్థానిక హెర్బల్ రెమిడీని అధికారికంగా ప్రారంభించారు. ‘Covid-Organics’ అని పిలిచే ఒక ఔషధాన్ని తయారు చేయించారు. Artemisia అనే మొక్క నుంచి ఈ ఔషధాన్ని తయారు చేశారు. ఇది మలేరియా చికిత్సలో ప్రభావంతంగా పనిచేస్తుందని రుజువైంది కూడా. దీనికి సంబంధించి ఉత్పత్తి కోసం దేశంలో ఒక ఫ్యాక్టరిని కూడా నిర్మించారు. కొవిడ్-19 చికిత్సతో వ్యాధిని నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయని అక్కడి అధికారులతో పాటు కొందరు అఫ్రికన్ నేతలు భారీగా ప్రచారం కల్పిస్తున్నారు.
ఈ ఔషధాన్ని క్లినికల్ గా పరీక్షించలేదు.. డ్రగ్ నియంత్రిత సంస్థ నుంచి ఎలాంటి ఆమోదం పొందలేదు. మడగాస్కర్ మంత్రి Rijasoa Andriamanana మాట్లాడుతూ.. Covid-Organics concoction కోసం 2.2 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.15 కోట్లు) ఖర్చు పెట్టి క్యాండీస్ స్వీట్ల కోసం ఆర్డర్ చేసినట్టు గతవారమే తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశీయ ద్వీపంలో చదువుకునే విద్యార్థుల కోసం స్వీట్లు, లాలీపప్స్ ఒక్కొక్కరికి మూడు చొప్పున వచ్చేలా ఆర్డర్ చేసినట్టు తెలిపారు. ఎందుకంటే… కరోనా రెమిడీగా ఇచ్చే హెర్బల్ టీ చాలా చేదుగా ఉంటుందని, అది పిల్లలు తాగలేరని అందుకే ఇలా స్పీట్లు పంచినట్టు చెప్పుకొచ్చారు.
మరోవైపు దేశ అధ్యక్షుడు Andry Rajoelina.. చరిత్రను మార్చే తమ దేశీయ ‘గ్రీన్ గోల్డ్’ పేరుతో హెర్బల్ టీని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రమోటింగ్ చేస్తున్నారు. Covid-Organics ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటివరూ శాస్త్రీయ అధ్యయనం పరంగా ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కొవిడ్-19 వ్యాధిని నివారించే ఎలాంటి మందులు లేవని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపేద దేశాల్లో ఒకటైన మడగాస్కర్ లో స్వీట్ల కోసం భారీగా ఖర్చు పెట్టారంటూ మీడియాలో కథనాలు రావడంతో ఆర్డర్ రద్దు చేసినట్టు నివేదిక వెల్లడించింది. కానీ, తాను ప్రకటించిన ప్లాన్ ను మంత్రి సమర్థించుకున్నారు. కానీ, కేబినెట్ నిర్ణయానికి సంబంధించినది కాదు కూడా.