US Mass Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి.. 60మందికిపైగా గాయాలు

ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది.

US Mass Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి.. 60మందికిపైగా గాయాలు

US Mass Shooting

US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించగా.. మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో మైనేలోని లెవిస్టన్ నగరంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో ఒకభాగమైన లెవిస్టన్.. మైనే అతిపెద్ద నగరమైన పోర్ట్ ల్యాండ్ కు ఉత్తరాన 35మైళ్ల (56 కిలో మీటర్ల) దూరంలో ఉంది.

Also Read:  Former Uttarakhand C.M : కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు

ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది. అయితే, ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మేము ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము. అన్ని వ్యాపారాలు వారి సంస్థలను మూసివేయాలని కోరుతున్నాం. మైనే డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేప్టీ ప్రతినిధి.. ప్రజలను తలుపులు మూసి తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. లెవిస్టన్ లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ భారీ ప్రాణ నష్టం జరిగిందని ఒక ప్రకటన విడుదల చేసింది.

మైనే కాంగ్రెస్ సభ్యుడు జారెడ్ గోల్డెన్ ఎక్స్ (ట్విటర్)లో ఇలా వ్రాశాడు.. అందరులాగానే నేనుకూడా రాత్రి లూయిసన్ లో జరిగిన సంఘటనలను చూసి భయపడిపోయాను. ఇది నా స్వస్థలం. ప్రస్తుతం. ఈ ప్రాంతంలో స్థానిక పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.