అమెరికాలో భారీ రోడ్డు ప్రమాదం..ఒకదానికొకటి ఢీకొన్న 100 వాహనాలు..ఐదుగురు మృతి

అమెరికాలో భారీ రోడ్డు ప్రమాదం..ఒకదానికొకటి ఢీకొన్న 100 వాహనాలు..ఐదుగురు మృతి

Updated On : February 12, 2021 / 6:50 AM IST

road accident in America : అమెరికాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు వంద కార్లు, కంటైనర్లు ధ్వంసమయ్యాయి. ఐదుగురు వాహనదారులు మృతి చెందారు. 70 మందికి పైగా గాయాలపాలయ్యారు.

మంచుతో నిండిన రహదారి పరిస్థితులు ప్రమాదానికి కారణం కావచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. టెక్సాస్‌లోని డల్లాస్‌కు 50 కిలోమీటర్ల దూరంలో యూనైటెడ్ స్టేట్స్ ఫోర్ట్‌ వర్త్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చాలా మంది ధ్వంసమైన వాహనాల్లో చిక్కుకున్నారు. వారందరిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ 30 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపై ప్రమాద దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంతో రహదారిపై పేర్చుకుపోయిన వాహనాలను పోలీసులు క్లియర్‌ చేశారు.