వైట్ డ్రెస్‌లో మెలానియా ట్రంప్..ఆకుపచ్చ బట్ట ఏంటీ 

  • Published By: madhu ,Published On : February 24, 2020 / 01:33 PM IST
వైట్ డ్రెస్‌లో మెలానియా ట్రంప్..ఆకుపచ్చ బట్ట ఏంటీ 

Updated On : February 24, 2020 / 1:33 PM IST

మెలానియా ట్రంప్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుటుంబసభ్యులు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఉదయం అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అందులో నుంచి ట్రంప్..ఆయన సతీమణి మెలానియా కిందకు దిగుతున్నారు. అందరి దృష్టి వారు వేసుకున్న డ్రెస్‌పైనే ఉంది. మెలానియా వైట్ ఔట్ ఫిట్‌లో కనిపించారు. ట్రంప్ నలుగురు సూట్ ధరించి..పసుపు రంగుతో ఉన్న టై వేసుకున్నారు. 

కానీ..డ్రెస్‌తో పాటుగా..ఆమె ఆకుపచ్చ రంగులో ఉన్న శాష్ కట్టుకున్నారు. అసలు ఏంటా వస్త్రం అంటూ అందరూ చర్చించుకోవడం ప్రారంభించారు. ఎయిర్ పోర్టు నుంచి మోతేరా స్టేడియంకు..అక్కడి నుంచి ఆగ్రా వరకు అదే డ్రెస్ వేసుకున్నారు. శాష్ (భుజానికి లేదా నడుముకు ధరించే వస్త్రం) మెలానియా కట్టుకున్న ఆకుపచ్చ వస్త్రాన్ని డిజైనర్ హెర్వ్ పియర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.

ఆకుపచ్చ, బంగారు రంగుతో ఉన్న ఈ వస్త్రాన్ని 20 శతబ్దానికి చెందిన ఇండియన్ టెక్స్ టైల్స్‌తో తయారు చేసినట్లు హెర్వ్ తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా చెప్పారు. ఈ వస్త్రంలోని బోర్డర్ చాలా అరుదైన క్లాత్‌గా అభివర్ణించారు. మెలానియాకు వైట్ ఔట్ ఫిట్ అంటే చాలా ఇష్టమని, ఎక్కువగా ఆమె వాటినే ధరిస్తుంటారని అంటుంటారు. మెలానియా ట్రంప్ మోడల్ కావడంతో..పర్యటనలకు వెళ్లే సమయంలో..ఏ దుస్తులు వేసుకోవాలన్నది ఆమెనే సొంతంగా ఎంచుకుంటారని టాక్. 

Read More : హైదరాబాద్‌లో దేశ ద్రోహులున్నారు – లక్ష్మణ్