అర్థరాత్రి నేషనల్ హైవేపై పోర్న్ వీడియోలు ప్రసారం

  • Published By: venkaiahnaidu ,Published On : January 12, 2020 / 04:12 PM IST
అర్థరాత్రి నేషనల్ హైవేపై పోర్న్ వీడియోలు ప్రసారం

Updated On : January 12, 2020 / 4:12 PM IST

ఓ ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి హైవేపై వెళ్తున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రకటనలు రావాల్సిన హైవే పక్కనున్న ఎలక్ట్రానిక్ బిల్ బోర్డుపై పోర్న్ వీడియోలు ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  అమెరికాలోని మిచిగాన్ లో ఈ ఘటన జరిగింది.

మిచిగాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఇటీవల మిచిగాన్‌ నేషనల్‌ హైవేపై బైకుమీద వెళుతున్న ఇద్దరు యువకులు బిల్‌బోర్డును కంట్రోల్‌ చేసే గది దగ్గరకు వెళ్లారు. తమ సెల్‌ఫోన్‌లో ఉన్న పోర్న్‌ వీడియో బిల్‌బోర్డు తెరపై వచ్చేలా చేశారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న బిల్‌బోర్డు తెరలపై పోర్న్‌ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో హైవేపై వెళుతున్న వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్కడినుంచి వెళ్లిపోతూ ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ ఇద్దరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

బిల్‌బోర్డుపై దాదాపు 17 నిమిషాల పాటు పోర్న్‌ వీడియోలు ప్రదర్శితమయ్యాయి. ఇది గమనించిన పోలీసులు సంబంధిత వ్యక్తులను అలర్ట్‌ చేశారు. వారు వెంటనే వీడియోలను నిలిపివేశారు. బిల్‌బోర్డ్‌ గది సీసీ టీవీ ఫొటేజ్‌ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.