కరోనావైరస్‌ తగ్గినా ఆ 2 లక్షణాలు మాత్రం అంత త్వరగా పోవు

కరోనావైరస్‌ తగ్గినా ఆ 2 లక్షణాలు మాత్రం అంత త్వరగా పోవు

Updated On : July 19, 2020 / 2:54 PM IST

COVID-19 నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అవుతుంటే నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైమే కదా. అంతకంటే ఉత్సాహం ఇంకొకటి ఉండదు మరి.. కానీ అనేక లక్షణాలు అన్నీ తగ్గిపోయి SARS-CoV2 కరోనావైరస్ దాటిన తర్వాత మరిన్ని సమస్యలు వచ్చిపడతాయట. ఇటాలియన్ స్టడీలో తేలిన విషయాల్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ఇలా రాసుకొచ్చింది. ఓ ఐదు వారాల పాటు కరోనాతో పోరాడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి బయటికొచ్చిన కొవిడ్ పేషెంట్లను పరీక్షించింది.

చాలా మంది ఇప్పటికీ ఓ రెండు లక్షణాలతో బాధపడుతున్నట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. 19నుంచి 84 ఏళ్ల లోపు ఉన్న 143మంది పేషెంట్లపై స్టడీ నిర్వహించారు. ఓ హాస్పిటల్‌లో రెండు వారాల పాటు గడిపిన వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఐదో వంతు మందికి వెంటిలేషన్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఇంటికి పంపిన ఐదు వారాల వరకూ 53శాతం కంటే ఎక్కువ మంది పేషెంట్లు నీరసంగా 43శాతం మందికి ఇప్పటికీ శ్వాస తీసుకోవడం కష్టంగానే ఉంది.

రికవరీ అయిన పేషెంట్లందరిలో కామన్ గా ఛాతి నొప్పి 22శాతం మందికి ఉంటే జాయింట్ పెయిన్ 27శాతం మందికి ఉంది. కేవలం 13శాతం మంది మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. కొవిడ్ సోకిన వారు రికవరీ అవడానికి సుదీర్ఘ కాలం పట్టడంలో రీసెర్చర్లకు ఎటువంటి ఆశ్చర్యం లేదు. 2003 SARS తర్వాత JAMA ఇంటర్నేషనల్ మెడిసిన్ అప్పట్లో నాలుగేళ్ల తర్వాత కోలుకున్న వారిపై స్టడీ నిర్వహించింది. వాళ్లలో ఇంకా అదే అలసట కనిపిస్తున్నట్లుగా చెప్పారు.

‘చాలా మంది పేషెంట్లలో కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వారాలు నెలల పాటు లక్షణాలు కనిపిస్తుండొచ్చని న్యూయార్క్ సిటీ ఎమెర్జన్సీ మెడిసిన్ ఫిజిషియన్ రాబర్ట్ గ్లాటర్ అంటున్నారు. నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేవి రెండు సాధారణ లక్షణాలు. చాలా మందిలో ఇవే కాకుండా తరచూ జ్వరం వచ్చిపోతుండటం, న్యూరలాజికల్ సమస్యలు కూడా ఉండొచ్చని రాబర్ట్ అభిప్రాయం.