80-Foot Object: బీచ్ వద్ద 80 అడుగుల గుర్తు తెలియని వస్తువు

అమెరికాలో ఓ బీచ్ వద్ద 80 అడుగుల (24.3 మీటర్ల) పొడువు ఉన్న గుర్తు తెలియని వస్తువు కనపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో డేటోనా బీచ్ ఒడ్డున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. చెక్కతో పాటు మరో లోహంతో ఈ వస్తువు ఉందని అధికారులు చెప్పారు.

80-Foot Object: బీచ్ వద్ద 80 అడుగుల గుర్తు తెలియని వస్తువు

80-Foot Object

80-Foot Object: అమెరికాలో ఓ బీచ్ వద్ద 80 అడుగుల (24.3 మీటర్ల) పొడువు ఉన్న గుర్తు తెలియని వస్తువు కనపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో డేటోనా బీచ్ ఒడ్డున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. చెక్కతో పాటు మరో లోహంతో ఈ వస్తువు ఉందని అధికారులు చెప్పారు.

బీచ్ కి వెళ్లిన కొందరు మొదట ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆ వస్తువును గతంలో ఇసుకలో పాతిపెట్టగా అది గత నెల సంభవించిన హరీకేన్ నికోల్ వల్ల బయటకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ వస్తువు ఏమై ఉంటుందన్న విషయాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, 80 అడుగుల పొడువు ఉన్న ఆ వస్తువుకు సంబంధించి పలు సిద్ధాంతాల ఆధారంగా పరిశోధకులు కొన్ని విషయాలు కూడా చెబుతున్నారు. చాలా మంది అధికారులు మాత్రం అది నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ కు సంబంధించిన వస్తువని చెబుతున్నారు.

మరికొందరు అది పురాతన ఓడ శకలాలకు సంబంధించిందని అంటున్నారు. సాగర తీరం కోతకు గురి కావడం వంటి పరిణామాల వల్ల అది బయటపడిందని చెబుతున్నారు. 80 అడుగుల పొడువు ఉన్న ఆ వస్తువుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్