Benjamin Netanyahu : హమాస్ మిలిటెంట్లందరినీ చంపేస్తా…ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హమాస్ ను పూర్తిగా నాశనం చేస్తానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు....

Benjamin Netanyahu
Israeli Prime Minister Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హమాస్ ను పూర్తిగా నాశనం చేస్తానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సభ్యులందరినీ మట్టుపెడతానని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్పారు.
Also Read : గాజాలో అమెరికన్ బందీల విడుదలకు యూఎష్ రహస్య కమాండో ఆపరేషన్
నెతన్యాహు మొదటిసారి హమాస్ఆకస్మిక దాడి తరువాత వారిని పూర్తిగా నాశనం చేయాలనే ఇజ్రాయెల్ ఉద్దేశాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రపంచం డేష్‌ను నాశనం చేసినట్లుగా మేం హమాస్ ను అణిచివేస్తాం అని నెతన్యాహు టెలివిజన్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని తన రాజకీయ విభేదాలను మర్చిపోయి సంక్షోభ సమయంలో మాజీ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్‌తో కలిసి అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.