North Korea : ఉత్తర కొరియా అణు జలాంతర్గామి ప్రారంభం

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు జలాంతర్గామిని ప్రారంభించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఉత్తర కొరియా కొత్తగా వ్యూహాత్మక అణు జలాంతర్గామిని శుక్రవారం ప్రారంభించింది....

North Korea : ఉత్తర కొరియా అణు జలాంతర్గామి ప్రారంభం

North Korea Nuclear Submarine

Updated On : September 8, 2023 / 6:29 AM IST

North Korea : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు జలాంతర్గామిని ప్రారంభించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఉత్తర కొరియా కొత్తగా వ్యూహాత్మక అణు జలాంతర్గామిని శుక్రవారం ప్రారంభించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జలాంతర్గామి ప్రయోగ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. (North Korea Launches) తాజాగా రష్యా అధ్యక్షుడితో భేటీ అయిన కిమ్ జోంగ్ స్వదేశమైన ఉత్తర కొరియాకు రాగానే అణు జలాంతర్గామిని ప్రారంభించారు. (New Tactical Nuclear Attack Submarine)

G20 Summit : స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సంచెజ్‌కు కరోనా…జి 20 సదస్సుకు డుమ్మా

ఈ సబ్ మెరైన్ లాంచ్ వేడుక నార్త్ కొరియా నావికాదళాన్ని బలోపేతం చేయడానికి నాంది పలికిందని డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా తెలిపింది. ఇటీవల కిమ్ జోంగ్ పలుసార్లు క్షిపణులను ప్రయోగించారు. నిత్యం ఆర్మీ బలోపేతంపై దృష్టి సారించిన కిమ్ జోంగ్ అణు జలాంతర్గామిని ప్రారంభించి సంచలనం రేపారు.