North Korea : ఉత్తర కొరియా 2020 లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి పర్యాటకులకు అనుమతి

ఉత్తర కొరియా 2020 లాక్‌డౌన్ తర్వాత దేశంలోకి ప్రవేశించడానికి మొదటిసారి పర్యాటకులను అనుమతించింది. కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న సమయంలో ఉత్తర కొరియా ప్రపంచంలోనే కఠినమైన సరిహద్దు నియంత్రణలను విధించింది....

North Korea : ఉత్తర కొరియా 2020 లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి పర్యాటకులకు అనుమతి

North Korea

Updated On : January 12, 2024 / 8:10 AM IST

North Korea : ఉత్తర కొరియా 2020 లాక్‌డౌన్ తర్వాత దేశంలోకి ప్రవేశించడానికి మొదటిసారి పర్యాటకులను అనుమతించింది. కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న సమయంలో ఉత్తర కొరియా ప్రపంచంలోనే కఠినమైన సరిహద్దు నియంత్రణలను విధించింది. రష్యా దేశం నుంచి మొదటి పర్యాటకుల బృందం ఉత్తరకొరియా దేశాన్ని సందర్శించింది. 2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి నిరోధక సరిహద్దు లాక్‌డౌన్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తర కొరియాలోకి అనుమతించిన మొట్టమొదటి పర్యాటకులుగా రష్యా బృందం నిలిచింది.

ALSO READ : Mumbai Attack Mastermind : ముంబయి దాడి సూత్రధారి హఫీజ్ భుట్టవీ మృతి…ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరణ

ఉత్తరకొరియా ఇంకా పూర్తిగా విదేశీయుల ప్రవేశానికి తెరవలేదు. నాలుగేళ్లుగా ఉత్తర కొరియాలో విదేశీ పర్యాటకులు ఎవరూ సందర్శించలేదు. మొదటిసారి రష్యా పర్యాటకుల బృందం స్కీ రిసార్టులో పర్యటిస్తుందని బీజింగ్‌కు చెందిన కొరియో టూర్స్ జనరల్ మేనేజర్ సైమన్ కాకెరెల్ చెప్పారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరులో తూర్పు రష్యాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు.

ALSO READ : Covid sub-variant JN.1 : దేశంలో 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి

అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ , సైనిక రంగాలలో సహకారాన్ని అందించుకోవాలని రెండు దేశాల అధినేతలు నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభానికి ఒక సంవత్సరం ముందు ఉత్తర కొరియాలో చైనా పర్యాటకుల పెరుగుదల కనిపించింది.