Amazon Jungle : అమెజాన్ అడవిలో రహస్య రన్‌వే
బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీప్రాంతంలో ఓ రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు. డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఈ రన్ వేను అధికారులు బాంబులతో ధ్వంసం చేశారు.

Amazon
secret runway in Amazon jungle : అమెజాన్ అడవుల్లో రహస్య రన్‌వే బయటపడింది. బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీప్రాంతంలో ఓ రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు. డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఈ రన్ వేను… బొలీవియా యాంటీ-నార్కొటిక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బాంబులతో ధ్వంసం చేశారు. బ్రెజిల్ కు చెందిన హెలికాప్టర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పైలట్‌కు బ్రెజిల్‌లో అత్యంత ప్రమాదకర డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పైలట్ రహస్య రన్‌వే నుంచి ఒక్కో ట్రిప్పుకు 300 నుంచి 450 కిలోల డ్రగ్స్‌తో నెలకు ఆరు సార్లు విమానం తీసుకెళ్లినట్లు విచారణలో పేర్కొన్నాడు. ఏడాది కాలంగా ఈ రహస్య రన్ వే నుంచి స్మగ్లర్లు డ్రగ్స్ సరఫరా చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. దాదాపు 60శాతం అంటే ఈ అడవుల విస్తీర్ణంలో రెండవ వంతు బ్రెజిల్ లో విస్తరించి ఉంది. పెరూ, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్వడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానాలలో విస్తరించి ఉన్నాయి.