Python : ఇంటి పైకప్పు మీద భారీ కొండచిలువ ప్రత్యక్షం.. ఎంత పొడుగు ఉందో చూశారా?
అక్కడ పాములు కనిపించడం సర్వసాధారణమట. అయితే తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇంటి పై కప్పు నుండి చెట్లపైకి పాకుతూ వెళ్తున్న దానిని చూసి జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్కడంటే?

Australia
Python- Australia : ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రాంతంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దానిని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ కొండచిలువ వీడియో వైరల్ అవుతోంది.
Australia beach : ఆస్ట్రేలియా బీచ్‌లో వింత వస్తువు చంద్రయాన్-3 శకలమేనా..?
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పరిసర ప్రాంతంలో 16 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇంటి పైకప్పు మీదుగా కదులుతున్నట్లుగా కనిపించడంతో అసలు అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియక ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలోని జనమంతా దానిని చూడటానికి గుమిగూడారు. ఈ సంఘటను ఓ వ్యక్తి (@Levandov_2) కెమెరాలో బంధించి ‘ఆస్ట్రేలియాలో ఇవి సర్వసాధారణమే’ అనే శీర్షికతో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత నేను చాలా ఫేమస్ అయ్యాను: ఆస్ట్రేలియా యువకుడు
కొండచిలువ ఇంటి పై కప్పునుంచి పాకుతూ ఎత్తైన చెట్ల మీదకు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ కొండచిలువలు రకరకాల పాములు కనిపించడం సర్వసాధారణమట. మనుష్యులు, జంతువులపై అవి దాడికి తెగబడుతుంటాయని.. వాటి నుంచి చాలామంది ప్రాణాలను కాపాడానని సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన స్నేక్ క్యాచర్ డాన్ చెప్పాడు.
Normal things in Australia pic.twitter.com/KW3oN8zIwO
— Levandov (@Levandov_2) August 27, 2023