పాకిస్తాన్ లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు

  • Published By: murthy ,Published On : June 8, 2020 / 10:22 AM IST
పాకిస్తాన్ లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు

Updated On : June 8, 2020 / 10:22 AM IST

పాకిస్తాన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 4,728 వైరస్ కేసులు నమోదుఅయ్యాయి.దీంతో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,03, 671 కి చేరింది. 

అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 38,903, సింధు రాష్ట్రంలో 38,108 వైరస్‌ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. గత 24 గంటల్లో వైరస్ కారణంగా 65 మంది మరణించగా…మొత్తం మరణాల సంఖ్య 2,067 కి చేరింది. 34, 355 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

కాగా….పాకిస్థాన్‌ మాజీ ప్రధాని  షాహిద్‌ ఖాకాన్‌ అబ్బాసికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని పీఎంఎల్‌-ఎన్‌ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు డాన్‌ పత్రికతో మాట్లాడుతూ ధృవీకరించారు. 

అంతకుక్రితం రైల్వేశాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 1,03,671 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా 2,067 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 34,355 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

Read: దటీజ్ న్యూజిలాండ్ : కరోనా కేసులు జీరో