పాక్ కాళ్లబేరం : ఈ ఒక్కసారికి వదిలేయండి.. ప్లీజ్

పాక్ కాళ్లబేరం : ఈ ఒక్కసారికి వదిలేయండి.. ప్లీజ్

Updated On : February 25, 2019 / 7:33 AM IST

గుజరాత్‌ సభలో మాట్లాడిన పీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సూటిగా పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు తగిలాయి. శాంతిని నెలకొల్పేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పాక్ ప్రధాని కార్యాలయం నుంచి మోడీ వరకూ అభ్యర్థనలు వచ్చి చేరాయి. గుజరాత్‌లోని టంక్ వేదికగా కశ్మీరీ ప్రజల కోసం పోరాడుతున్నాం. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటాం. మూలాలను ఏరి పారేస్తాం. పుల్వామా దాడికి భారత్ బాగా నష్టపోయింది. వీటిని చూస్తూ ఊరుకోమని ఉద్వేగపూరితంగా వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.

పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ.. ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలియజేసేందుకు కలిశారు. ఆ సందర్భంలో ఇమ్రాన్.. పేదరికం, నిరక్షరాస్యతలపై కలిసి పోరాడదామని మోడీకి మాటిచ్చారు. పటాన్ కుటుంబానికి చెందిన వాడినని మాటిస్తే తప్పనని కూడా చెప్పుకొచ్చారు.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!

మోడీ చేసిన వ్యాఖ్యల అనంతరం పాక్ పీఎం కార్యాలయం నుంచి ఈ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. ‘పీఎం ఇమ్రాన్‌ఖాన్ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు. ఇండియా మాకు ఒక్క అవకాశం ఇస్తే ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తాం. పీఎం మోడీ మాకు ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ పేర్కొన్నారు. 

గుజరాత్‌లో మోడీ ప్రసంగానికి ముందే ఇమ్రాన్‌ఖాన్.. ఉగ్రవాదానికి పాల్పడిన జైషే మొహమ్మద్ సంస్థకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే చర్యలు తీసుకునే ముందు వారే ఆ దాడులకు పాల్పడినట్లు సాక్ష్యాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. వీటిపై స్పందించిన భారత ప్రభుత్వం.. ముంబై 26/11దాడులకు పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాదులేనంటూ సాక్ష్యాలతో సహా ముందుంచితే పదేళ్ల నుంచి ఒక్క చర్య కూడా తీసుకోలేదు పాక్ ప్రభుత్వం. మళ్లీ వాగ్గానాలు చేస్తూ తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొస్తుందంటూ పాక్ వ్యాఖ్యలను ఖండించింది. 
Read Also: అక్కడ ఏం జరిగింది : శ్రీధరణిని చంపింది ప్రియుడేనా!