Pakistan PM France Tour : గొడుగు తీసుకెళ్లిపోయిన పాక్ ప్రధాని .. వర్షంలో తడిసిపోయిన మహిళా అధికారి

గొడుగు తీసుకెళ్లిపోయిన మహిళను అలా వర్షంలో వదిలేయటం సరికాదంటూ విమర్శిస్తున్నారు.

Pakistan PM France Tour : గొడుగు తీసుకెళ్లిపోయిన పాక్ ప్రధాని .. వర్షంలో తడిసిపోయిన మహిళా అధికారి

Pakistan PM France Tour

Updated On : June 23, 2023 / 2:46 PM IST

Pak PM Shehbaz Sharif France Tour : ప్యారిస్ (Paris)లో జరిగే రెండు రోజుల న్యూగ్లోబర్ ఫైనాన్స్ ప్యాక్ట్ సమ్మిట్ (New Global Financing Pact Summit)లో పాల్గొనేందుకు పాకిస్థాన్ (Pakistan )ప్రధాని షెహబాజ్ షరీఫ్(Prime Minister Shehbaz Sharif)గురువారం (జూన్ 22,2023)చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాక్ ప్రధాని ఫ్రాన్స్(France )చేరుకునేసరికే అక్కడ వర్షం మొదలైంది. దీంతో కారులోంచి దిగుతున్న ప్రధానికి అప్పటికే అక్కడ గొడుగు పట్టుకుని ఓ మహిళా అధికారి (protocol officer)నిలబడ్డారు. ఆయన కారునుంచి దిగగానే ఆమె షరీఫ్ కు గొడుగు పట్టారు.కారు దిగిన ప్రధాని సదరు మహిళా అధికారితో ఏదో చెప్పారు ఆ తరువాత ఆయన ఆమె చేతిలోంచి గొడుగు తీసుకుని ముందుకెళ్లిపోయారు. దీంతో పాపం ఆ మహిళా అధికారి వర్షంలో తడుస్తునే షరీఫ్ వెనకాలే నడుచుకుంటు వచ్చారు. ఆమె వర్షంలో తడిసిపోయారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాక్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళను అలా వర్షంలో వదిలేయటం సరికాదంటూ విమర్శిస్తున్నారు.మహిళా అధికారి నుంచి గొడుకు తీసుకెళ్లిపోయిన ప్రధాని ఫరీష్ (Shehbaz Sharif)కు మరో అధికారి ఎదురొచ్చి ఆయనను స్వయంగా దగ్గరుండి తీసుకెళ్లారు.