Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. ఎనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతి

ఈ ఘటనపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. దాడుల వెనుక ఉన్నవారిని శిక్షించాలి. పోలీసులు, పరిపాలన అధికారులు ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు.

Pakistan: పాకిస్థాన్‌లో దారుణం..  ఎనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతి

People carry a teacher's body into an ambulance

Updated On : May 5, 2023 / 8:41 AM IST

Pakistan: పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉపాధ్యాయులు మృతిచెందారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఏడుగురు ఉపాధ్యాయులు మృతిచెందగా, మరో ఘటనలో కదులుతున్న వాహనంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు జరపడంతో అతను మరణించాడు. ఈ రెండు ఘటనల్లో మృతిచెందిన ఉపాధ్యాయులు దేశంలోని షియా ముస్లిం మైనార్టీకి చెందినవారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఈ కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

Pakistan: ప్రభుత్వానికి విపక్షానికి మధ్య కుదిరిన ఒప్పందం.. తొందరలో ఎన్నికలు!

ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచిన్ లోని ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్‌ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి‌చంపాడు. అతడు సున్నీ మెంగల్ తెగకు చెందిన వ్యక్తి. ఆగ్రహంతో ఊగిపోయిన మెంగల్ తెగకు చెందిన వ్యక్తి ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్ లోకి చొరబడి తోరీ షియా తెగకు చెందిన ఉపాధ్యాయులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో ఏడుగురు ఉపాధ్యాయులు మృతిచెందారు. అయితే, కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా మెంగల్, తోరి షియా తెగలకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.

Pakistan : బాంబులతో దద్దరిల్లిన పాకిస్థాన్.. కబాల్ పోలీస్ స్టేషన్‌ వద్ద ఉగ్రదాడి.. 13 మంది మృతి

ఈ ఘటనపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. దాడుల వెనుక ఉన్నవారిని శిక్షించాలి. పోలీసులు, పరిపాలన అధికారులు ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించలేమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి బిలావల్ భుట్టో సూచించారు.