పాక్ మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి…ముగ్గురిని హతమార్చిన సైన్యం
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మియాన్ వాలి ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అప్రమత్తమైన పాక్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది....

Mianwali airbase
Pak Terrorists Attack : పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మియాన్ వాలి ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అప్రమత్తమైన పాక్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మియాన్‌వాలిలోని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై శనివారం పలు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని, ప్రతీకార కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) వెల్లడించింది.
ఆరుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో వైమానిక స్థావరంపై తెల్లవారుజామున దాడి చేయడంతో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించేలోపు తాము దాడిని విఫలం చేశామని పాక్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ దాడిలో వైమానిక దళ స్థావరంలో నిలిపి ఉంచిన మూడు విమానాలు, ఇంధన బౌజర్ కూడా దెబ్బతిన్నాయని పాక్ సైన్యం తెలిపింది.
Also Read : Delhi Air pollution : ఢిల్లీలో వాయుకాలుష్యం ఎఫెక్ట్…ప్రజలు ఇళ్లలోనే ఉండండి, అనవసర ప్రయాణాలు వద్దు
ఈ దాడిని తామే చేశామని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ ప్రకటించింది. ఉగ్రవాదులు, పాక్ సైన్యానికి మధ్య పాకిస్థాన్‌లోని మియాన్‌వలీ ఎయిర్ బేస్ లో భీకర కాల్పులు జరుగుతున్నాయి.