Thailand : అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకవుతారు

కొన్నిచోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పలేం. ఇప్పుడు మీరు చూడబోయే టాయిలెట్ చూస్తే షాకవుతారు. ఎందుకో చదవండి.

Thailand : అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకవుతారు

Thailand

Updated On : August 24, 2023 / 5:30 PM IST

Thailand : థాయ్‌లాండ్‌లో ఓ వాష్‌రూమ్ రూస్తే షాకవుతారు. బంగారు రంగులో ప్యాలెస్‌ను తలపిస్తున్న వాష్‌రూమ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

Salman Khan : జైలులో టాయిలెట్స్ కూడా కడిగాను.. వైరల్ అవుతున్న సల్మాన్ వ్యాఖ్యలు..

బంగారు రంగులో మెరిసిపోతున్న భవనం.. చుట్టూ పచ్చని మొక్కలు.. చూడటానికి అదేదో ఖరీదైన ప్యాలెస్ అనుకునేరు. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ క్రిషాంగి (krishangiisaikia) షేర్ చేసిన వీడియో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది ప్యాలెస్ కాదు. వాష్‌రూమ్ అట. వీడియో మొదలు కాగానే అద్భుతమైన డిజైన్‌లో బంగారు వర్ణంలో మెరుస్తూ బాత్రూమ్ కనిపిస్తుంది. వాష్‌రూమ్ బయట గార్డెన్ కనిపిస్తుంది. నిర్మాణాన్ని చూస్తే ఎంత అద్భుతంగా కట్టారో అనిపిస్తుంది.  క్రిషాంగి ‘వాష్‌రూమ్‌లో ఎప్పుడూ వీడియో తీస్తానని అనుకోలేదు. కానీ ఈ రోజు నన్ను నేను ఆపుకోలేకపోయాను. ఇది చూడండి’ అనే  శీర్షికతో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Phone to the washroom : టాయిలెట్‌కి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

నెటిజన్లు వాష్‌రూమ్ అద్భుతంగా ఉందని.. అది వాష్‌రూమ్ అంటే నమ్మలేకపోతున్నామని కామెంట్లు పెట్టారు. వాష్‌రూమ్ వాల్ డిజైన్లు మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ????????? || ?????? ????? (@krishangiisaikia)