Air Hostess: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టి.. అంతటితో ఆగకుండా..

అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో 61ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Air Hostess: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టి.. అంతటితో ఆగకుండా..

Delta Air Lines,

Updated On : April 22, 2023 / 2:26 PM IST

Air Hostess: విమాన ప్రయాణాల్లో కొందరు ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ప్రయాణికుడు వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారింది. తాజాగా ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ కు ముద్దుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెను గట్టిగా హత్తుకొనే ప్రయత్నం చేయడంతో పాటు దాడికిసైతం దిగారు. ఫ్లైట్ కెప్టెన్ కు మీల్స్ తీసుకెళ్లే ట్రేలోని ప్లేట్ ను విరగొట్టాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇక్కడ విచిత్ర ఏమిటంటే అతనికి 61ఏళ్లు.

 

అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిన్నెయాపోలిస్ నుంచి అంకోరేజ్ కు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. ఈ విమానంలో అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన డేవిడ్ అలన్ బర్క్ (61) అనే ప్రయాణికుడు ఎక్కాడు. ప్లైట్ టేకాఫ్ కాకముందే ఎయిర్ హోస్టెస్ ను పిలిచి రెడ్ వైన్ అడిగాడు. అందుకు ఎయిర్ హోస్టెస్ నిరాకరించింది. నిబంధనలకు విరుద్దమని చెప్పింది. ప్లైట్ టేకాఫ్ అయ్యాక సర్వ్ చేస్తానని చెప్పింది.

 

ప్లైట్ టేకాఫ్ అయ్యాక ఎయిర్ హోస్టెస్ అతనికి రెడ్ వైన్ సర్వ్ చేసింది. కొద్దిసేపటికి అలన్ బర్క్ మద్యం మత్తులోకి జారుకున్నాడు. మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ముద్దు పెట్టమని అడిగాడు. అందుకు ఎయిర్ హోస్టెస్ నిరాకరించడంతో బలవంతంగా ఆమె మెడను పట్టుకొని లాగి ముద్దు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను హత్తుకొనే ప్రయత్నం చేయడంతో పాటు దాడికి దిగాడు. కెప్టెన్ మీల్స్ తీసుకెళ్తున్న ట్రేలోని ప్లేట్ ను విరగగొట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు ప్లైట్ సిబ్బందికి తెలియజేయగా.. విమానం అంకోరేజ్ కు చేరుకోగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.