సరస్వతీ దేవి చుట్టూ నెమళ్లు ప్రదక్షిణాలు..జర్మనీలో అరుదైన దృశ్యం వైరల్ వీడియో

సరస్వతీ దేవి చుట్టూ నెమళ్లు ప్రదక్షిణాలు..జర్మనీలో అరుదైన దృశ్యం వైరల్ వీడియో

Updated On : January 6, 2021 / 4:36 PM IST

peacocks circle around saraswati mata : జర్మనీలోని శ్రీపీఠ నిలయంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. భక్తులను మంత్రముగ్దుల్ని చేసింది. శ్రీపీఠ నిలయంలోని ఆశ్రమంలో ఉంటున్న మూడు నెమళ్లు సరస్వతి దేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేశాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెల్లటి హంసను వాహనంగా చేసుకున్న చదువుల తల్లి సరస్వతి అమ్మవారి విగ్రహం చుట్టూ మూడు నెమళ్లు… ప్రదక్షిణం చేయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ నెమళ్లు ఏదో ఆటలాడుకున్నట్లుగా కాక..ఎంతో భక్తి శ్రద్ధలతో సరస్వతీ దేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయటం చూసిన భక్తులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.

ఆ నెమళ్లు అలా ఎందుకు చేశాయో ఎవరికీ అర్థం కాలేదు. వాటికి ఎవరూ ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. పోనీ ఎవరైనా అలా ప్రదక్షిణం చేయడాన్ని చూసి అవి అలా చేశాయా అంటే… అదీకూడా కాదు. కానీ ఈ మూడు నెమళ్లూ… ఒకదాని వెంట ఒకటి నడుస్తూ… ప్రదక్షిణం చేయడం చూసినవారిని నెటిజన్లకు కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

కాగా..మంత్ర ముగ్ధమైన సనాతన ధర్మంలోనే ఈ శక్తి ఉందనీ…పశుపక్ష్యాదులు కూడా ఆ సనాతన ధర్మలో భాగమేనని అందుకే ఆ నెమళ్లు పరిక్రమం చేశాయని ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఇటీజ్ శ్రీ అకౌంట్ నిర్వాహకులు కాప్షన్ పెట్టారు.