స్టడీ: స్కూల్స్ రీఓపెన్ చేస్తే పిల్లలను పంపించొచ్చా? ఓ స్టడీ క్లారిటీ ఇచ్చింది… పిల్లలు, టీనేజర్లలో కొద్దిమందికే కరోనా సోకుతుందంట

కుర్రాళ్లకు కరోనా సోకదు..ఒకవేళ వచ్చిన వాళ్లు తట్టుకోగలరన్నది వైద్యనిపుణుల అంచనా. ఇది నిజం కూడా. వాళ్లకున్న ఇమ్యూనిటీతో కరోనాను అడ్డుకోగలరు. 20 ఏళ్లుదాటినవాళ్లలో కన్నా పిల్లలు, టీనేజర్లలో సగంమందికే స్టడీ అంచనా వేసింది. అదే, 20, అంతకన్నా వయస్సు ఎక్కువున్నవాళ్లలో 35-60 శాతం మందికి కరోనా సోకచ్చని London School of Hygiene and Tropical Medicineలకు చెందిన epidemiologists అంచనా ఇది.
అదే 20 ఏళ్లలోపు వాళ్లలో అంటే పిల్లలు, టీనేజర్లలో సగం మందికే కరోనా సోకుతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వాళ్లకు కరోనా వచ్చినా వాళ్లలో లక్షణాలు కనిపించవు. అంటే asymptomatic. ఒకవేళ ఉన్నా చాలా కొద్ది మోతాదులోనే కనిపిస్తాయి. దీన్నే‘subclinical’ symptoms అంటున్నారు వైద్యనిపుణులు.
ఈ నివేదిక అంచనాలతో స్కూల్స్ ఎప్పుడు? ఎలా? రీఓపెన్ చేయాలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వాలు స్కూల్స్ తెరవాలని అనుకొంటున్నా, తల్లితండ్రులు మాత్రం ఆసక్తి చూపించడంలేదు. వ్యాక్సిన్ వచ్చేవరకు పిల్లలను స్కూల్స్‌కు పంపించబోమని చాలామంది పేరెంట్స్ తేల్చేస్తున్నారు. UNESCO అంచనాల ప్రకారం, 150 కోట్ల మంది విద్యార్ధులు అంటే, విద్యార్ధుల్లో 90శాతం ఇంటి దగ్గరే ఉండిపోయారు.
మొత్తం 190 దేశాల్లో ఇదే పరిస్థితి. China, Italy,Japan,Singapore,South Koreaల్లో ఈ స్టడీ నిర్వహించారు. mathematical modelsతో కరోనా ఏయే ప్రాంతాల్లో ఎలా వ్యాప్తి చెందిందో అర్ధం చేసుకున్నారు. వాటి ఆధారంగా అంచనాలను తీర్చిదిద్దారు. 10-19 మధ్య వయస్సు ఉన్నవాళ్లలో కరోనా వచ్చినా 21శాతం మందిలోనే లక్షణాలు కనిపిస్తున్నాయి. అదే వయస్సు పెరుగుతున్నకొద్దీ clinical symptoms మోతాదు పెరుగుతూనే ఉంటాయి.70 ఏళ్ల దాటినవాళ్లలో పది కరోనా లక్షణాల్లో ఏడు కనిపిస్తున్నాయి.