Indians in Qatar: ఖతార్‭లో మరణశిక్ష పడ్డ 8 మంది మాజీ సైనికులపై కీలక ప్రెస్ మీట్

Indians in Qatar: ఖతార్‭లో మరణశిక్ష పడ్డ 8 మంది మాజీ సైనికులపై కీలక ప్రెస్ మీట్

Updated On : October 27, 2023 / 6:20 PM IST

Indians in Qatar: ఖతార్‌లో 8 మంది భారత నేవీ మాజీ నావికులకు మరణశిక్ష విధించారనే విషయం తెలిసిందే. అయితే మరణశిక్షకు సంబంధించిన వివరాలను ఖతార్ ఇవ్వలేదు కానీ గూఢచర్యం చేశారన్ని ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి బంధీలుగా ఉంచింది. అయితే గూఢచర్యం ఆరోపణలు అవాస్తవమని మాజీ సైనికుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎనిమిది మందిలో ఒకరైన కమాండర్ కల్యాణ్ సుగుణాకర్ పాకాల కుటుంబం గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖతార్ చేసిన ఆరోపణల్ని ఖండించారు.

సుగుణాకర్ బావమరిది మాట్లాడుతూ ‘‘8మంది నేవీ అధికారులు గూఢచర్యంకు పాల్పడ్డారనేది దుష్ప్రచారం. ఈ ఆరోపణలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఉపాధి అవకాశాలు కోసం 8మంది మాజీ అధికారులు దోహకు వెళ్లారు. ఇజ్రాయిల్ కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు వెనుక ఎటువంటి ఆధారాలు లభించలేదు. 14నెలలుగా నిరాధారమైన కేసులో నిర్బంధంలో వున్నారు. ఖతార్ నిర్బంధించిన 8మంది మాజీ అధికారులు ఇండియన్ నేవీలో నిబద్ధతతో పనిచేశారు’’ అని అన్నాడు.

ఇది కూడా చదవండి: Ashok Gehlot said ED as Dogs: ఈడీని కుక్కలతో పోలుస్తూ వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఒకరు ప్రెసిడెంట్ మెడల్ పొందిన అధికారి. 2018లో కరుణాకర్ దోహా వెళ్లారు. జీవనోపాధి కోసం దోహా వెళ్లిన సుగుణాకర్ రావ్ ను గూఢాచార్యం కేసులో ఇరికించి మరణ శిక్ష విధించడం అన్యాయం. 2013 వరకు ఇండియన్ నేవీ లో పనిచేసిన సుగుణాకర్ రావ్ 2018 లో దోహా వెళ్లారు. 14 నెలల కిందట అరెస్ట్ చేసినా 80 రోజుల వరకు భారత ఎంబసీకి కూడా కనీస సమాచారం లేదు. ప్రధాని మోడీ తలచుకుంటే తక్షణమే ఖాతార్ విడుదల చేస్తుంది.
ప్రధానిని జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం’’ అని అన్నాడు.

ఎనిమిది మంది మాజీ సైనికులు వీరు ఒక సంవత్సరం పాటుగా ఖతార్‌లో బందిఖానాలో ఉన్నారు. కాగా గురువారం (అక్టోబర్ 26, 2023) అక్కడి కోర్టు మొత్తం ఎనిమిది మందికి మరణశిక్షను ప్రకటించింది. వారిపై అభియోగాలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఖతార్ బహిరంగపరచలేదు. అయితే గూఢచర్యం ఆరోపణలపై వారిని గత సంవత్సరం అరెస్టు చేశారు. ఖతార్ కోర్టు నిర్ణయం పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారతీయులను ఉరి నుంచి రక్షించడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: China: రూ.6 కోట్లు బ్యాంకు నుంచి డ్రా చేసి, తర్వాత బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించాడు

శిక్ష పడిన 8 మంది భారతీయులు ఎవరు?
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికుల పేర్లు – కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేష్. వీరంతా డిఫెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్ – దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేశారు. ఈ ప్రైవేట్ సంస్థ రాయల్ ఒమానీ వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ సభ్యుని యాజమాన్యంలో ఉంది. ఈ ప్రైవేట్ సంస్థ ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించేది.

ఇజ్రాయెల్ గూఢచర్యం
ఆరోపణలపై 8 మంది మాజీ భారతీయ మెరైన్లపై ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సమాచారం బహిరంగపరచబడలేదు. గతేడాది ఆగస్టు 8, 2022న వారిని అరెస్టు చేశారు. అనేక మీడియా నివేదికల ప్రకారం.. ఈ భారతీయ పౌరులు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నారని, ఖతార్ కు చెందిన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో కంపెనీ యజమానిని కూడా అరెస్టు చేశారు. అయితే అతడు నవంబర్ 2022లో విడుదలయ్యాడు.