International Day: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాయలంలో యోగా చేయనున్న ప్రధాని మోదీ

చారిత్రాత్మక యోగా కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులతో పాటు గ్లోబల్, డయాస్పోరా కమ్యూనిటీలోని ప్రముఖ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ కోసం యోగాకు అనుకూలమైన దుస్తులు ధరించమని అతిథులకు సూచించారు

International Day: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాయలంలో యోగా చేయనున్న ప్రధాని మోదీ

UN Headquarters: ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా చేయనున్నారు. యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడాన్ని పెట్టుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అనంతరం 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయంగా యోగా దినోత్సవం కోనసాగుతోంది.

America : ఇంట్లోకి చొరబడిన దొంగను కాలుస్తున్నట్లు కల కని.. నిద్ర మబ్బులో తుపాకీతో తనను తాను కాల్చుకున్న వ్యక్తి

ఈ నెల 21న నిర్వహించే 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో నిర్వహించే యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకమ్మని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానించారు. ఉదయం 8 నుంసీ 9 గంటల వరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని నార్త్ లాన్‌లో యోగా సెషన్ జరుగుతుంది. ఇక్కడ గత సంవత్సరం డిసెంబర్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

AAP Offer to Congress: కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమంటూ ప్రకటన

చారిత్రాత్మక యోగా కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులతో పాటు గ్లోబల్, డయాస్పోరా కమ్యూనిటీలోని ప్రముఖ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ కోసం యోగాకు అనుకూలమైన దుస్తులు ధరించమని అతిథులకు సూచించారు. సెషన్ సమయంలో యోగా మ్యాట్‌లు అందిస్తామని పేర్కొన్నారు.

Madhya Pradesh: పడుకున్న భర్త జననాంగాలపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. దానికి ముందు ఏం జరిగిందంటే?

యోగా ప్రాచీనమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన అభ్యాసమని, ఇది భారత దేశం నుంచి ఆవిర్భవించిందని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలు యోగా దినోత్సవానికి మద్దతు పలికాయి. దాదాపు ఈ అన్ని దేశాల్లో యోగా కార్యక్రమాలు కొనసాగుతాయి. కాగా, దేశం బయట ప్రధాని మోదీ యోగా దినోత్సవంలో పాల్గొనడం ఇదే తొలిసారి.