ఖతర్‌లో ఒక్కరోజే 238 కరోనా కేసులు

గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్‌లో బుధవారం ఒక్కరోజులోనే 238 కరోనా కేసులు కన్ఫామ్ అయ్యాయి. దీంతో కరోనా ఇన్ఫెక్షన్‌కు గురైన వారి సంఖ్య 262కు చేరింది. రోగులందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి పబ్లిక్‌కు దూరంగా ఉండేలా చూస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఆదివారం ఖతర్ ప్రభుత్వం మూడు కరోనా కేసులను గుర్తించింది. రెండ్రోజుల నుంచి ఒక్కటి లేకపోయినా బుధవారం ఉన్నట్టుండి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదై షాకింగ్ గురి చేశాయి. వైరస్ ఉందని తెలియకముందే ఇతరులతో కలిసి తిరగడం ద్వారా వారికి కూడా సోకి ఉండొచ్చని చెబుతున్నారు.
వ్యాధి సోకిన వారి సంబంధీకుల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. సాధ్యమైనంత వరకూ వైరస్ సోకిన వారికి మంచి చికిత్స అందించేందుకే ప్రయత్నిస్తున్నామని వైద్యులు అంటున్నారు. ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోయినా యూనివర్సిటీలు, స్కూళ్లను మూసి వేసింది.
ఖతర్‌లో నమోదైన తొలి కేసు ఇరాన్ నుంచి వచ్చిందే. ఇరాన్‌లోనూ ఇదే పరిస్థితి. బుధవారం 63మృతి చెందినట్లు వెల్లడించింది. ఖతర్ ఆరోగ్య శాఖ పబ్లిక్ ఈవెంట్లు రద్దు చేయడంతో పాటు 14దేశాలకు ప్రయాణాలు రద్దు చేసేసింది. బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, శ్రీ లంక, సిరియా, థాయ్‌లాండ్ ల నుంచి రాకపోకలు నిలిపేసింది.
కరోనా వైరస్ అధికారికంగా మహమ్మారిగా మారిపోయింది. World Health Organization(WHO) ప్రపంచ దేశఆలను వణికిస్తోన్న వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించేసింది. ‘మహమ్మారి అంటే పదం మాత్రమే కాదు. వెంటాడుతున్న మృత్యుభయాన్ని వ్యక్తికరీంచే పదం. శక్తికి మించిన ప్రమాదం ఉన్నప్పుడే ఈ పదాన్ని వాడతారు’ WHOకు చెందిన టెడ్రోస్ ఆధోనమ్ గెబ్రెయేసుస్ బుధవారం వెల్లడించారు.
See Also | కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO