చావునుంచి తప్పించుకుందామని వెళ్తున్నా..ఆపి నన్ను చంపేస్తారాఏంటీ : పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు

చావునుంచి తప్పించుకుందామని వెళ్తున్నా..ఆపి నన్ను చంపేస్తారా?ఏంటీ అంటూ తనను ఆపిన పోలీసుల్ని ప్రశ్నించాడు ఓ యువకుడు. చావునుంచి బైటపడటమేంటీ? ఆపితే చచ్చిపోటమేంటి? అని పోలీసులు అడిగినదానికి అతను చెప్పిన సమాధానం విని ఆ పోలీసులు నిజంగా షాక్ అయ్యారు. ఆతరువాత అతనికి సహాయం చేశారు. మరి ఆ వ్యక్తి పోలీసులకు చెప్పిన మాట ఏంటో తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ ప్రాంతం. అత్యంత రద్దీ ప్రాంతం. వేల సంఖ్యలో వాహనాలు తిరగే ప్రాంతం. కాబట్టి క్వీన్స్ లాండ్ ఏరియాలో వాహనాలు స్లోగా వెళ్లాల్సిందే.కానీ ఓ వ్యక్తి ఏకంగా అత్యంత వేగంతో కారును పోనిస్తున్నాడు. అది చూసిన పోలీసులకు చిర్రెత్తింది. ఏంటీవీడు..పెద్ద తోపా? ఏంటా స్పీడు..ఎవరికైనా ఏమన్నా జరిగితే పరిస్థితి ఏంటీ..బహుశా మద్యం తాగి ఉంటాడేమోనని అనుకుంటూ స్పీడ్ గా వెళ్తున్న వాహనాన్ని వెంబడించారు.
కొంతసేపు రోడ్డు మీద సినిమా ఫక్కీలో ఛేజింగ్ నడించింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఏంటా స్పీడు కారుదిగు అంటూ గద్దించారు. కానీ అతను కారు దిగలేదు. ‘చావు నుంచి తప్పించుకోవడానికే స్పీడ్ గా వెళ్తున్నాను..నన్ను ఆప్పి చచ్చిపోయేలా చేస్తారా ఏంటీ అంటూ కంగారు కంగారుగా ప్రశ్నించాడు. అది విని పోలీలసులకు ఏమీ అర్థం కాలేదు.
దానికి అతను ‘నా పేరు జిమ్మీ.. క్వీన్స్‌లాండ్‌కు చిన్నపని మీద వచ్చాను. తిరిగి వెళ్లటానికి నా కారు ఎక్కాను. కానీ కారులో నాకు సడెన్ నాకు ఓపాము కనిపించింది. ఆ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఈస్ట్రన్ బ్రౌన్ పాము. అది నా కారులోకి ఎలా వచ్చిందో తెలియదు. దానిని పట్టుకుని చంపుతుండగా అది నన్ను కాటు వేసింది. అయినా దానిని ఎలాగోలా చంపేశాను.
కానీ అది వేసిన కాటుతో దాని విషం మెల్లిగా నా శరీరంలో పాకుతోంది. నా కాళ్లు వణుకుతున్నాయి. శరీరం మొద్దుబారినట్లుగా అయిపోవడంతో భయంవేసింది. దీంతో ఎలాగైనా చావు నుంచి తప్పించుకోవాలనే ఆసుపత్రికి బయలుదేరాను. అందుకే కారును గంటకు 120 కి.మీ వేగంతో నడిపాను’ అంటూ టకటకమని చెప్పాడు.
జిమ్మీ మాటలు విన్న పోలీసులు కూడా కంగారుపడ్డారు. అతని మీద జాలి పడుతూ.. వెంటనే అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జిమ్మీకి ఆరోగ్యం బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబందంచిన ఫోటోలు.. వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Read Here>>TikTok Pro పేరుతో మేసేజ్ వచ్చిందా, క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం