Meta Survey: ఫేస్‭బుక్ ఫౌండర్ జూకర్‭బర్గ్‭ను సొంత ఉద్యోగులే నమ్మడం లేదు!

మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్‭బర్గ్‭ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మేధస్సు అభివృద్ధి గురించి చర్చించారట

Meta Survey: ఫేస్‭బుక్ ఫౌండర్ జూకర్‭బర్గ్‭ను సొంత ఉద్యోగులే నమ్మడం లేదు!

Zuckerberg Leadership: మెటా ఫౌంటర్ మార్క్ జూకర్‭బర్గ్‭ మీద ఆ సంస్థలోని 70 శాతం ఉద్యోగులకు నమ్మకం లేదట. ఈ విషయాన్ని ఇంకెవరో చెప్పలేదు. స్వయంగా మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలోనే వెల్లడైంది. ఆయన నాయకత్వపై కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారని స్వయంగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలోనే తేలిందని వాషింగ్టన్ పోస్ట్‌ పేర్కొంది. తరుచూ ఇలాంటి సర్వేలు నిర్వహిస్తారని, అయితే గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో ఐదు శాతం వ్యతిరేకత పెరిగిందట.

Power Politics: తమిళనాడులో అమిత్ షా అడుగుపెట్టగానే కరెంట్ పోయింది. డీఎంకే కావాలనే చేసిందా?

అక్టోబర్‌లో 58 శాతం నుంచి 43 శాతం మంది ఉద్యోగులు జూకర్‭బర్గ్ మీద విశ్వాసం ఉంచారట. అయితే 21,000 కంటే ఎక్కువ ఉద్యోగుల కోత, ఉన్న ఉద్యోగులకు బడ్జెట్ తగ్గింపు వంటి కారణాల వల్ల జూకర్‭బర్గ్ మీద నైరాశ్యం పెరిగిందట. మెటా ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి, కంపెనీలోని తక్కువ ప్రాధాన్యత గల ప్రాజెక్ట్‌లను రద్దు చేస్తున్నారు. అంతే కాకుండా నియామకాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ప్రకటనల వ్యయంలో మెటా పోస్ట్-పాండమిక్ తిరోగమనంతో నడుస్తోందట.

Joe Biden: 5 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బాంబ్ పేల్చిన బాంబ్‭షెల్

ఇక మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్‭బర్గ్‭ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మేధస్సు అభివృద్ధి గురించి చర్చించారట. “ఇతరులు చేయని కొత్త మార్గాలలో నూతన సామర్థ్యాలను కోట్లాది మందికి అందించడంలో మేము ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నాము” అని ఉద్యోగులతో జుకర్‌బర్గ్ అన్నారాట.

Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యపై ఖలిస్తానీలు నిర్వహించిన పరేడ్‭లో తప్పేం లేదట.. కెనడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వివాదాదస్పద వ్యాఖ్యలు

ఇక సంస్థలో ఉద్యోగుల తొలగింపుపై జుకర్‌బర్గ్ స్పందిస్తూ తొలగింపులు, ఇప్పుడు తీసుకుంటున్న మార్పులు తన లక్ష్యం కాదని, కానీ కొన్ని కష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఉద్యోగులతో అన్నారట. ప్రపంచంలో అస్థిరం ఏర్పడిందని, దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ మెటా కార్యకలాపాలను విస్తారించాలని అన్నారట. రానున్న రోజుల్లో తొలగింపులను తగ్గిస్తూ కంపెనీకి పూర్వవైభవం తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు.