Russia Bans Flights : 36 దేశాల విమానాలను నిషేదించిన రష్యా: ఫిఫా మ్యాచులపైనా ఆంక్షలు
బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ మరియు కెనడా సహా మొత్తం 36 దేశాల విమానాలపై రష్యా ఆంక్షలు విధించినట్లు ఆదేశ విమానయానశాఖ సోమవారం ప్రకటించింది

Russia
Russia Bans Flights: యుక్రెయిన్ తో యుద్ధానికి దిగిన రష్యా పై ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆర్ధిక, దౌత్యపరమైన ఆంక్షలు సహకార, రవాణా, వ్యవస్థలపైనా రష్యా పై ఆంక్షలు విధించాయి పలు దేశాలు. ఆ ఆంక్షలను ఏ మాత్రం లెక్కచేయని రష్యా.. మరింత కఠినంగా వ్యవహరిస్తూ యుద్ధం చేస్తూనే ఉంది. ఈక్రమంలో రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు దేశాలు ఇటీవల రష్యా నుంచి తమ దేశాలకు వచ్చే విమానాలను నిషేధించాయి. అమెరికా సహా యూరోప్ లోని 16 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధంపై రష్యా వెనక్కు తగ్గని పక్షంలో యురోపియన్ యూనియన్ దేశాలు సైతం రష్యా విమానాలను బహిష్కరించాల్సి ఉంటుందని.. యురోపియన్ యూనియన్ నాయకులు ఆదివారం రష్యాను హెచ్చరించారు.
Also read: Russo-Ukraine War: భారత్‌పై రష్యా-యుక్రెయిన్ యుద్ధ ప్రభావం.. భారీగా నష్టపోతున్న రంగం ఇదే!
ఇదిలాఉంటే.. విమానాలను నిషేదం సహా, తమపై ఆంక్షలు విధించిన దేశాలపై.. రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ విమానాలను నిషేదించిన ఆయా దేశాల విమానాలను సైతం రష్యా నిషేధం విధించింది. బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ మరియు కెనడా సహా మొత్తం 36 దేశాల విమానాలపై రష్యా ఆంక్షలు విధించినట్లు ఆదేశ విమానయానశాఖ సోమవారం ప్రకటించింది. తమ గగనతలంలోకి రాకుండా నిషేదించింది. అయితే ప్రత్యేక అనుమతితో అత్యవసర విమానాలను మాత్రం తమ గగనతలం గుండా అనుమతిస్తున్నట్లు రష్యా అధికారిక విమానయానశాఖ రోసావియాట్సియా తెలిపింది.
Also read: NATO: యుక్రెయిన్‌కు క్షిపణులు, ఆయుధాలు అందిస్తామన్న నాటో
మరోవైపు యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడంపై అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య FIFA స్పందించింది. రష్యా ఫుట్ బాల్ టీంను ప్రపంచ కప్ లో ఆడేందుకు అనుమతించేది లేదని ఫిఫా పేర్కొంది. ఒకవేళ ఆటగాళ్లు ఆడేందుకు వచ్చినా.. రష్యా జాతీయ పతాకం వీడి, జ్జాతియా గీతాన్ని ఆలపించకూడదని ఫిఫా ఆంక్షలు విధించింది. రష్యా జాతీయ జట్టుగా గేమ్ లో పోటీ పడదని, ఫుట్ బాల్ యూనియన్ ఆఫ్ రష్యా (ఆర్ ఎఫ్ యు)గా పోటీ పడుతుందని ఫిఫా పేర్కొంది. అది కూడా ఆమోదయోగ్యమైన భూభాగంలో అభిమానులు లేకుండా మ్యాచులు జరుగుతాయని ఫిఫా వివరించింది. అయితే.. రష్యా ఫుట్ బాల్ టీంపై ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయాలు సరిపోవని.. పూర్తిగా నిషేధం విధించాలని యూరోప్ లోని పలు ఫుట్ బాల్ టీంలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్వీడన్ టీంలు రష్యాతో మ్యాచులు ఆడబోమని స్పష్టం చేశాయి.
Also read: PM Modi on Ukraine Crisis: రష్యాపై యుక్రెయిన్ యుద్ధం.. భారతీయుల కోసం మోదీ అత్యున్నత స్థాయి సమావేశం