NATO: యుక్రెయిన్‌కు క్షిపణులు, ఆయుధాలు అందిస్తామన్న నాటో
యుక్రెయిన్ కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. రష్యాపై ఒంటరి పోరాటం చేస్తున్న యుక్రెయిన్ కు క్షిపణులు, ఆయుధాలు పంపిస్తామని నాటో సెక్రటరీ జనరల్..

Nato
NATO: వరుసగా 5వ రోజు కూడా రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. యుక్రెయిన్‌లోని చెర్నిహివ్ పై గత రాత్రి మొత్తం రష్యా బాంబుల వర్షం కురిపించింది. చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై క్షిపణి దాడి చేసింది రష్యా. దీంతో ఆ భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఖార్కివ్‌లోనూ రష్యా సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి.
మరోవైపు యుక్రెయిన్ కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. రష్యాపై ఒంటరి పోరాటం చేస్తున్న యుక్రెయిన్ కు క్షిపణులు, ఆయుధాలు పంపిస్తామని నాటో(NATO) సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ తెలిపారు. రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నా, క్షిపణులతో విరుచుకుపడుతున్నా.. ఏ మాత్రం బెదరకుండా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చూపుతున్న ధైర్య సాహసాలను నాటో సెక్రటరీ జనరల్ ప్రశంసించారు. యుక్రెయిన్ కు అండగా ఉంటామన్న ఆయన.. ఆయుధాల సరఫరాను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం యుక్రెయిన్ అత్యంత కఠినమైన, భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. అత్యంత నిరాశాజనకమైన సమయంలోనూ అపారమైన శౌర్యాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించినందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. తన మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకోవడానికి, చివరి శ్వాస వరకు పోరాడాలని, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి తన బలగాలను నడిపిస్తున్నాడని జెలెన్ స్కీని ప్రశంసించారు నాటో సెక్రటరీ జనరల్.
నాటో, దాని మిత్రదేశాలు కైవ్‌లో వాయు-రక్షణ క్షిపణులు, ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలు, అలాగే మానవతా, ఆర్థిక సహాయాల సరఫరాను కొనసాగిస్తాయని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. జెలెన్ స్కీతో నేను మాట్లాడాను. ఆయన ధైర్య సాహసాలను మెచ్చుకున్నా. నాటో దాని మిత్ర దేశాలు యుక్రెయిన్ కు బాంబులు, క్షిపణులు అందిస్తామని చెప్పా. అలాగే మానవతా కోణంలో సాయం అందిస్తామని, ఆర్థికపరమైన సాయం చేస్తామని జెలెన్ స్కీతో చెప్పినట్టు నాటో సెక్రటరీ జనరల్ వెల్లడించారు.
I just spoke with President @ZelenskyyUa & commended him for the bravery of the people & armed forces of #Ukraine. #NATO Allies are stepping up support with air-defence missiles, anti-tank weapons, as well as humanitarian & financial aid.
— Jens Stoltenberg (@jensstoltenberg) February 28, 2022
Russia-Ukraine War: భారత సైన్యాన్ని పంపమంటూ ఏడుస్తూ రిక్వెస్ట్!
రష్యా, యుక్రెయిన్ మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ రష్యా సేనలు దూసుకొస్తుండగా.. యుక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్, ప్రధాన నగరమైన ఖర్కీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కీవ్‌లో వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ అయ్యాయని స్థానిక వార్త సంస్థలు తెలిపాయి. అక్కడి ప్రజలు సమీపంలోని షెల్టర్‌లో ఆశ్రయం పొందాలని సూచనలు వచ్చినట్లు చెప్పింది.
I just spoke with President @ZelenskyyUa & commended him for the bravery of the people & armed forces of #Ukraine. #NATO Allies are stepping up support with air-defence missiles, anti-tank weapons, as well as humanitarian & financial aid.
— Jens Stoltenberg (@jensstoltenberg) February 28, 2022