Russia-Ukraine war : యుక్రెయిన్‌పై రష్యా చేసే యుద్ధాన్ని విమర్శిస్తే పౌరసత్వం రద్దు
యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధాన్ని విమర్శించినా..రష్యా ఆర్మీపై విమర్శలు చేసినా..తప్పుడు ప్రచారాలు చేసినా పౌరసత్వం రద్దు చేస్తామని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

Russia to ‘strip passports’ from citizens who criticise Ukraine war
Ukraine war..putin threatens to strip passports : నియంతత్వానికి మారుపేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీని కోసం చట్ట సవరణలు కూడా చేస్తున్నారు. దీంట్లో భాగంగా యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధాన్ని విమర్శించినా..రష్యా ఆర్మీపై విమర్శలు చేసినా..తప్పుడు ప్రచారాలు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినంటూ సంకేతాలు పంపారు పుతిన్. యుక్రెయిన్ పై చేసే యుద్ధాన్ని విమర్శించేవారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేయటానికి సిద్ధపడుతోంది పుతిన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి బిల్లులో మార్పులు చేయనుంది.
దీని కోసం అధ్యక్షుడు పుతిన్ రష్యా పార్లమెంట్ ఆమోదించిన ఓ చట్టానికి సవరణలను ప్రతిపాదించారు. రష్యా సైన్యాన్ని విమర్శించేవారిని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిని నేరస్థులుగా పరిగణించి వారి రష్యన్ పాస్‌పోర్టులను, పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్టు అధికార మీడియా వెల్లడించింది. రష్యాలో కొత్త భూభాగాల విలీనం ఫలితంగా పాస్‌పోర్టు ద్వారా రష్యా పౌరసత్వాన్ని పొందినవారిని ఈ చట్టం టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రష్యా ప్రజల మధ్య వైషమ్యాన్ని పెంచే ప్రయత్నంలో అమెరికాతో పాటు పాశ్చాత్య మిత్రదేశాల వంటి రష్యా శత్రువులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని రష్యా అధికారులు చెబుతున్నారు. కాగా రష్యాలో పలువురు యుక్రెయిన్ పై యుద్ధం చేయటానికి వ్యతిరేకించిన విషయం తెలిసిందే.