Russia Ukraine War: రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం..
రెండు వైపులా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శాశ్వత కాల్పుల విరమణను చూడాలనుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.

Russia Ukraine War: యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు. మూడు రోజుల పాటు కాల్పుల విరమిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. మే 8 ఉదయం నుండి మే 11వ తేదీ అర్థరాత్రి వరకు సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందన్నారు.
రష్యా 80వ విక్టరీ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ వెల్లడించారు. సీజ్ ఫైర్ సమయంలో అన్ని సైనిక చర్యలు ఆగిపోనున్నాయి. దాదాపు మూడేళ్లుగా రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రజలు చనిపోయారు.
Also Read: కిలో బియ్యం రూ.339, డజన్ గుడ్లు రూ.332, కిలో నెయ్యి రూ.3వేలు.. పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న ధరలు..
పుతిన్ నిర్ణయంపై యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా స్పందించారు. కనీసం 30 రోజుల పాటు తక్షణ కాల్పుల విరమణకు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు వైట్ హౌస్ కూడా రియాక్ట్ అయ్యింది. రెండు వైపులా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శాశ్వత కాల్పుల విరమణను చూడాలనుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
ఈస్టర్ సందర్భంగా క్రెమ్లిన్ ఇదే తరహాలో 30 గంటల కాల్పుల విరమణను ప్రకటించింది. కానీ రెండు వైపులా వందలాది ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. యుక్రెయిన్‌లో 20 కంటే ఎక్కువ సార్లు కాల్పుల విరమణ ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ చివరికి విఫలమయ్యాయి. కొన్ని అమల్లోకి వచ్చిన నిమిషాల్లోనే విఫలమయ్యాయి.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here