Samosas In Toilet : 30 ఏళ్లుగా టాయిలెట్‌లోనే సమోసాలు తయారీ.. రెస్టారెంట్‌కు సీల్..!

Samosas In Toilet : సౌదీ అరేబియాలో అదో ఫేమస్ రెస్టారెంట్.. అక్కడికి వచ్చినవాళ్లు కచ్చితంగా ఆ రెస్టారెంటులో సమోసాలు తినకుండా వెళ్లరు.

Samosas In Toilet : 30 ఏళ్లుగా టాయిలెట్‌లోనే సమోసాలు తయారీ.. రెస్టారెంట్‌కు సీల్..!

Saudi Arabia Restaurant Shut Down For Preparing Samosas In Toilet For 30 Years

Updated On : April 27, 2022 / 8:47 AM IST

Samosas In Toilet : సౌదీ అరేబియాలో అదో ఫేమస్ రెస్టారెంట్.. అక్కడికి వచ్చినవాళ్లు కచ్చితంగా ఆ రెస్టారెంటులో సమోసాలు తినకుండా వెళ్లరు. అంత ఫేమస్.. ఆ సౌదీ రెస్టారెంట్ సమోసాల తయారీ వెనుక అసలు వ్యవహారం బయటపడింది. అంతే.. ఇప్పుడా రెస్టారెంటుకు సీల్ పడింది. ఎందుకంటే.. 30ఏళ్లుగా ఈ రెస్టారెంట్ సమోసాలను టాయిలెట్‌లోనే తయారుచేస్తోంది. భోజనాలేమో వాష్ రూంలో వడ్డీస్తోంది. కనీస శుభ్రత కూడా పాటించని ఈ రెస్టారెంటుపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఈ రెస్టారెంట్ తీరు మారలేదు. రెస్టారెంట్ నిర్వాహకులు పూర్తి అపరిశుSaudi Arabia Restaurant Shut Down For Preparing Samosas In Toilet For 30 Yearsభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.

ఆహార పదార్థాలను తయారు చేసేందుకు నాణ్యమైన సరుకులను కూడా ఉపయోగించడం లేదు. తక్కువ ధరకు వచ్చే పదార్ధాలను తీసుకొచ్చి రెస్టారెంటులో వాడేస్తున్నారు. దాంతో కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆర్డర్ చేసిన ఆహారంలో బూజు రావడం, బొద్దింకలు, బల్లల అవశేషాలు కనిపిస్తున్నాయి.

కస్టమర్ల ఫిర్యాదులతో ఆ రెస్టారెంటులో తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఎలుకలు, బొద్దింకలు, పురుగులు ఉండటాన్ని గుర్తించారు. పనిచేసే వారు, తినే పదార్థాలు తయారు చేస్తున్న గది పక్కనే కాల కృత్యాలు తీర్చుకోవడాన్ని గుర్తించారు. షాకైన అధికారులు వెంటనే హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి హోటల్‌ను మూసివేయాలని నిర్వాహకులను ఆదేశించారు. వెంటనే రెస్టారెంటుకు సీల్ వేశారు.

Read Also : Tamil Nadu : తమిళనాడులో ఆలయ రథోత్సవంలో విషాదం.. విద్యుత్ షాక్ తో 11 మంది భక్తులు మృతి