బిన్ లాడెన్ కొడుకు పౌరసత్వం రద్దు.. ఆచూకీ ఇస్తే భారీ నజరానా

  • Published By: vamsi ,Published On : March 2, 2019 / 01:48 AM IST
బిన్ లాడెన్ కొడుకు పౌరసత్వం రద్దు.. ఆచూకీ ఇస్తే భారీ నజరానా

Updated On : March 2, 2019 / 1:48 AM IST

ఆల్ ఖైదా ఉగ్రవాదుల ఒకప్పటి అగ్ర నాయకుని కొడుకు ఒసామా బిన్‌ లాడెన్‌ కొడుకు హంజాబిన్ లాడెన్ పై విషయంలో సౌదీఅరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది హంజాబిన్ లాడెన్ పౌరసత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హంజాబిన్ లాడెన్ ఆచూకీ అందిస్తే 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 7.08 కోట్లు) అందిస్తామంటూ అమెరికా ప్రకటించిన నేపధ్యంలో హంజాబిన్ లాడెన్ పౌనసత్వం రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
Read Also : గివేం మాటలు : జేషే‌ ఏ మహ్మద్‌తో సంప్రదింపులు – ఖురేషీ

యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖైల్ ఇవనాఫ్ అతని ఆచూకీ  తెలిపినవారికి బహుమతి ప్రకటించిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ‘జీహాద్‌కు కాబోయే రాజు’ గా ఉగ్రవాదులు తరుచూ చెప్పుకొనే హంజాబిన్ లాడెన్ అల్ ఖైదా నాయకుడిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.

2017 జనవరిలో అంతర్జాతీయ తీవ్రవాదిగా అతనిని అమెరికా ప్రకటించింది. అతని ఆస్తులను కూడా అమెరికా బ్లాక్ చేసింది. ప్రపంచవ్యాప్త జీహాద్ కు ప్రధాన వ్యక్తిగా ఉండే బిన్‌ లాడెన్ కు వారసుడుగా హంజాబిన్ ఉగ్రవాదంలో కీలకంగా మారుతున్నట్లు అమెరికా నిఘా వర్గాల వద్ద సమాచారం ఉండటంతో యూఎస్‌ అతనిపై రివార్డు ప్రకటించింది.
Read Also : ఎలానో తెలుసుకోండి : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ

ఒసామా బిన్‌ లాడెన్‌ హతమైన అనంతరం అతని ముగ్గురు భార్యలు, పిల్లలు క్రమేపీ సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందారు. హంజాబిన్ మాత్రం ఎక్కడ ఉన్నాడు అనేదానిపై క్లారిటీ రాలేదు. తన తల్లితో కొన్నేళ్లపాటు ఇరాన్ లో ఉన్నాడనే ప్రచారం ఉన్నప్పటికీ, అతను ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడంటూ గతంలో అతని సవతి సోదరుడొకరు ఓ వార్త సంస్థతో తెలిపినట్లు ఉంది.  2001 సెప్టెంబరు 11 అమెరికాపై ఆల్ ఖైదా దాడుల్లో సుత్రదారి అయిన హైజాకర్ మహమ్మద్‌ అట్టా కూతరిని హంజాబిన్ పెళ్లి చేసుకున్నట్లు కూడా అతని సవితి సోదరుడు ఆ మీడియా సంస్థకు తెలిపాడు.
Read Also : తప్పుడు రాతలు ఆపండి.. పాక్ మీడియా కథనంపై పవన్ కళ్యాణ్