ఇంతకీ ఎవరిదో? : 15వందల ఏళ్లనాటి మనిషి పాదముద్ర ఇదిగో
అది మనిషి పాదముద్రేనా? చూడటానికి అచ్చం మనిషి పాదముద్రలానే ఉంది. ఇది ఈనాటిది కాదు.. కొన్నివేల ఏళ్ల నాటి పాదముద్ర. మనిషి పాదముద్రను పోలిన పాదముద్రను ఇటీవల సైంటిస్టులు గుర్తించారు.

అది మనిషి పాదముద్రేనా? చూడటానికి అచ్చం మనిషి పాదముద్రలానే ఉంది. ఇది ఈనాటిది కాదు.. కొన్నివేల ఏళ్ల నాటి పాదముద్ర. మనిషి పాదముద్రను పోలిన పాదముద్రను ఇటీవల సైంటిస్టులు గుర్తించారు.
చూడటానికి అచ్చం మనిషి పాదముద్రలానే ఉంది. ఇది నిజంగా మనిషి పాదముద్రేనా? ఇది ఈనాటిది కాదు.. కొన్నివేల ఏళ్ల నాటి పాదముద్ర. మనిషి పాదముద్రను పోలిన పాదముద్రను ఇటీవల సైంటిస్టులు గుర్తించారు. దక్షిణ అమెరికాలోని చిలే నగరంలో ఈ మనిషి పాద్రముద్రను సైంటిస్టుల బృందం గుర్తించినట్టు అక్కడి మీడియా నివేదించింది. రేడియో కార్బన్ సహాయంతో ఆ పాదముద్ర వయస్సును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 15వేల సంవత్సరాల కాలం నాటి మనిషి పాదముద్రగా నిర్ధారించారు. దక్షిణ అమెరికాలో ఆనాటి మనుషుల మనుగడ ఎలా ఉంటుందనేది సైంటిస్టులకు సవాల్ గా మారింది.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం.. పటగోనియా ప్రాంతంగా పిలిచే ఖండంలోని దక్షిణ కొనను 12వేల సంవత్సరాల క్రితం వరకు మానవులు ఎవరూ చేరుకోలేకపోయారని విశ్వసిస్తుంటారని పరిశోధన బృందంలోని సహ శాస్త్రవేత్త కరెన్ మెరెనో న్యూస్ ఏజెన్సీకి నివేదించారు. చిలేలో లభ్యమైన మనిషి పాదముద్రను పోలిన శిలాజాన్ని సైంటిస్టుల బృందం నిశితంగా పరిశోధించగా.. అది.. ఓ మనిషి కుడికాలి పాదముద్రగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఈ రీసెర్చ్ కు సంబంధించి గతవారం పీఎల్ఓఎస్-ఒన్ అనే సైంటిపిక్ జనరల్ లో ప్రచురించినట్టు మెరెనో చెప్పారు.
ఈ పాదముద్రను 2010లో దక్షిణ చిలే సమీపంలో ఆసోర్నో నగరంలోని పాలియో ఆర్కోలాజికల్ సైట్ దగ్గర గుర్తించినట్టు మెరెనో వెల్లడించారు. అయితే ఈ శిలాజాన్ని రేడియో కార్బర్ మెథడ్ ద్వారా వయోనిర్ధారణ చేయడానికి సైంటిస్టులకు 9 ఏళ్ల సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు. 1986 నుంచి ఆసోర్నో నగరంలో సైంటిస్టులు రీసెర్చ్ కొనసాగుతూనే ఉండగా.. ఆ పరిశోధనలో భారీ పరిమాణంలో ఉన్న ఎన్నో జంతువులకు సంబంధించిన శిలాజాలు బయటపడ్డాయి.
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా ప్రాంతంలో 3.6 మిలియన్ల ఏళ్ల నాటి మనిషి పాదముద్రలను 1978లో గుర్తించారు. తడితో నిండిన అగ్నిపర్వత బూడిదపై నడిచిన ముగ్గురి మానవుల పాదముద్రలుగా ధ్రువీకరించారు. 2018 ఏడాదిలో బ్రిటన్ కొలంబియాలో మరో మనిషి పాదముద్ర జాడ లభించింది. కానీ, ఈ పాదముద్ర వయస్సు 13వేల ఏళ్ల నాటిదిగా గుర్తించారు.