సీఏఏ వ్యతిరేక తీర్మానం చేసిన అమెరికన్ కౌన్సిల్

యునైటెడ్ స్టేట్స్‌లోని సీటిల్ సిటీ కౌన్సిల్ సోమవారం CAAకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టింది. భారత్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ బిల్లు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌లకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టింది. అమెరికన్ సిటీ కౌన్సిల్ సభ్యుడు క్షమా శావంత్ చేతుల మీదుగా జరిగింది.
భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, నేషనల్ రిజిష్ట్రర్ ఆఫ్ సిటిజన్స్‌ను ఇక్కడితో ముగించాలని అడగనున్నట్లు తెలిపారు. సీటిల్ సిటీలో దక్షిణాసియా నుంచి వచ్చిన వారెక్కువగా ఉండటం కూడా ఓ కారణమే. మతాలకు, కులాలకు అతీతంగా మనుగడ సాగిస్తున్నారు.
‘సీటిల్ సిటీ కౌన్సిల్ భారత్‌లో ఉన్న నేషనల్ రిజిష్ట్రర్ ఆఫ్ సిటిజన్స్, పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. ఇవి ముస్లింలపై వివక్ష చూపిస్తూ.. ఇతర కులాలను సపోర్టు చేస్తున్నట్లుగా ఉన్నాయి’ అని అధికారులు వెల్లడించారు. 1955లో చట్టాన్ని సవరిస్తూ డిసెంబరు 11న చట్టాన్ని ఆమోదించినప్పటికీ జనవరి 10న గుర్తింపు పొందింది.
ఈ చట్టం ప్రకారం.. బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన ఆరు మైనారిటీ కమ్యూనిటీలను మినహాయించింది. కొందరు విశ్లేషకులు ఇది ముస్లింలపై వివక్ష చూపించడమే అని ఆరోపిస్తున్నారు. ‘సీటిల్ సిటీ సీఏఏను ఖండించే వారందరికీ మెసేజ్ ఇస్తుంది. మతపరమైన స్వేచ్ఛను కల్పిస్తుంది’ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ కౌన్సిల్ అహసాన్ ఖాన్ అన్నారు.