America Shooting: అమెరికాలోని స్కూల్లో కాల్పుల మోత .. ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి

అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాలలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు.

America Shooting: అమెరికాలోని స్కూల్లో కాల్పుల మోత .. ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి

US School Shooting

Updated On : March 28, 2023 / 7:08 AM IST

America Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేలో 6వ తరగతి వరకు పిల్లలకు బోధించే ఓ క్రిస్టియన్ పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయి. ఈ పాఠశాలలో కాల్పుల సమయంలో 200 మంది పిల్లలు ఉన్నారు. కాల్పులు జరిపింది 28ఏళ్ల యువతి.

Shooting In USA : అమెరికా లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు.. ముగ్గురు మృతి

కాల్పులు జరుపుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువతి మరణించింది. అయితే ఆ యువతి ఎవరనేది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. కాల్పుల ఘటన అనంతరం తీవ్రంగా గాయపడ్డ చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను స్థానిక వాండర్ బిల్డ్ మన్రో కారెల్ జూనియర్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

California Shooting: కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. ఆర్నెళ్ల చిన్నారితోసహా ఆరుగురు మృతి

ఘటన తర్వాత పాఠశాలలో ఉన్న ఇతర విద్యార్థులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం 6వ తరగతి దిగువ క్లాస్ విద్యార్థులే కావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. భారీగా పోలీసు బలగాలు మోహరించి పిల్లలందరిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 10.27 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన అగంతుకురాలు ఎవరు? ఈ స్కూల్ తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? ఏ లక్ష్యంగా ఈ కాల్పులు జరిపింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.