విశ్లేషణ: కరోనా కేసుల్లో ఇటలీని దాటిన స్పెయిన్. మరణాలు మాత్రం ఎందుకు తక్కువ?

కరోనా వైరస్(COVID-19) హాట్ స్పాట్ ఉన్న ఇటలీని స్పెయిన్ అధిగమిస్తోంది. శుక్రవారం నాటికి ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్పెయిన్ లో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఇటలీనే అగ్రస్థానంలో ఉంది. స్పెయిన్ లో కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో స్పెయిన్ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. స్పెయిన్ లో వారంకి పైగా రోజుల్లో ముందురోజుకంటే తక్కువ మరణాలు శుక్రవారం నమోదయ్యాయి.
శుక్రవారం స్పెయిన్ లో కేసుల సంఖ్య 7శాతం పెరిగిందని,అయితే ఇది తగ్గుముఖం పట్టినట్లు తాము గమనిస్తున్నామని హెల్త్ ఎమర్జెన్సీ డిప్యూటీ హెడ్ మరియా జోసె రాల్లో తెలిపారు. వారం రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల స్పెయిన్ లో 20శాతం ఉండగా,శుక్రవారం నాటికి 7శాతానికి చేరుకుందని,వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని మరియా తెలిపారు. శుక్రవారం నాటికి ప్రపంచంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదైన 2వ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఇక కరోనా కేసులు ప్రపంచంలోనే అమెరికాలో ఎక్కువగా నమోదైన విషయం తెలిసిందే.
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాన్ సెజ్ ఇప్పటివరకు కఠిన ఆంక్షలను కరోనా దృష్ట్యా విధించిన విషయం తెలిసిందే. స్పెయిన్ లో ఎసెన్షియల్ సెక్టార్ లోని ఉద్యోగులను మాత్రమే ఆఫీసులకు వెళ్లనివ్వడం,ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేదఃందుకు అనుమతిస్తున్నారు. రెస్టారెంట్లు,బార్లు,షాపులు అన్నీ మూతపడ్డాయి. కరోనాపై యుద్ధంలో భాగంగా మార్చి-15,2020 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ ను స్పెయిన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ను జాతీయం చేసేసింది. అంతేకాకుండా దేశంలోని నాలుగో ఏడాది చదువుతున్న మెడికల్ విద్యార్థులందరినీ స్పెయిన్ హెల్త్ సర్పీస్ కు సాయం చేయాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు కరోనాకు స్పెయిన్ యువరాణి మారియా థెరీసా(86)బలైపోయిన విషయం తెలిసిందే. వైరస్ బారిన పడిన యువరాణి పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్ రాజు ఫెలిప్-6కు సోదరి.
కాగా,స్పెయిన్ లో ఇప్పటివరకు 1లక్షా 19వేల 199 కరోనా కేసులు నమోదుకాగా, 11వేల 198 మరణాలు నమోదయ్యాయి. అయితే స్పెయిన్ లో 4వేలకు పైగా కరోనా మృతులు ఒక్క రాజధాని మాడ్రిడ్ ప్రాంతానికి చెందినవారే. ఇక ఇటలీలో ఇప్పటివరకు 1లక్షా 19వేల 827 కరోనా కేసులు నమోదుకాగా, 14వేల 681 మరణాలు నమోదయ్యాయి. శనివారం నాటికి మళ్లీ కరోనా కేసుల నమోదులో స్పెయిన్ ను దాటింది ఇటలీ.
ఇక ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు అమెరికాలో 7,406మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 77వేల 475 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే కరోనా మరణాలు 24గంట్లలో అత్యధికంగా అమెరికాలోనే నమోదయ్యాయి. గురువారం(ఏప్రిల్-2,2020)రాత్రి 8గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్-3,2020)రాత్రి 8గంటలవరకు అమెరికాలో 1,408కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలోనే 24గంటల్లోనే కరోనా మరణాల రికార్డు అమెరికాలోనే నమోదయింది.
See Also | గుండెలు పిండేస్తున్న చిన్నారుల ఫొటోలు.. లాక్‌డౌన్ దెబ్బకు చితికిపోయిన పసిహృదయాలు