కరోనాకు కారణం ఆ ఒక్కడే: వైరస్ ఇలా వ్యాపించింది

డాక్టర్ల అజాగ్రత్తతో వూహాన్ హాస్పటిల్ లో చేరిన పేషెంట్ కరోనా వైరస్ పదిమందికి పాకేలా అయింది. తోటి పేషెంట్లతో పాటు వైద్య సిబ్బంది కూడా దీని బారినపడ్డారు. అతనితో పాటు మరో నలుగురు పేషెంట్లకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 34వేల మందికి సోకింది. 24 దేశాలను భయపెడుతోన్న కరోనా.. 720 మందిని బలితీసుకుంది.
అసలు వైరస్ ఎలా పుట్టింది? ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి వూహాన్ లోని 134 మంది పేషెంట్లను స్డడీ చేసిన వైద్యనిపుణులు నివ్వెరపోయారు. పేషెంట్లలో 22 ఏళ్ల నుంచి 92 ఏళ్ల వరకు ఉన్నారు. సగటు వయసు 56 ఏళ్లు. వూహాన్ యూనివర్సిటి హాస్పిటల్‌లో జనవరి 1 నుంచి 28 తేదీల మధ్య చేరిన పేషెంట్లను స్టడీచేశారు.
వీళ్లలో 41 శాతం మందికి హాస్పటల్‌కు వచ్చిన తర్వాత సోకింది కరోనా. వేరే రోగాలతో చేరి హాస్పిటల్‌కు వచ్చాక ఈ మహమ్మారి బారిన పడ్డారు. మొదటి పేషెంట్ నుంచి వైరస్ సంక్రమిస్తున్నా వైద్యసిబ్బందికి అనుమానం రాలేదు. కడుపులో నొప్పి, జ్వరం అన్నవాళ్లను పక్కవార్డుల్లో చేర్చారు. మరో నలుగురికి అదే సమస్య. వీళ్లందరికీ మొదటి పేషెంట్ నుంచే కరోనా సంక్రమించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి వాళ్లనే super-spreadersఅంటారు. SARS, MERS లాంటి వ్యాధులను వందల మందికి సోకడానికి కారణం ఇలాంటి బాధితులే. సార్స్ లక్షణాలు రెండుమూడు రోజుల్లోనే బయటకు కనిపిస్తాయి. అదే Caronavirus సోకిన వ్యక్తికి పెద్దగా జ్వరం కూడా ఉండదు. అతనిలోని కరోనా లక్షణాలు కనిపించడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుంది. అది చాలు చుట్టుప్రక్కల వాళ్లకు అంటుకోవడానికి.
ఇలాగే బాధితుడు హాస్సిటల్‌కు వచ్చి అక్కడున్న వైద్య సిబ్బందికి, మిగిలిన వాళ్లకు కరోనా వైరస్ అంటించాడు. సార్స్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎవరికైనా అంతుచిక్కని వ్యాధి వచ్చినప్పుడు అతన్ని హాస్పటల్‌కు తీసుకొస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం హాస్సిటల్ వ్యాధిబారిన పడినట్లే.
అదే వ్యక్తి నుంచి ఎలా:
కరోనా సోకిన వ్యక్తిని సర్జికల్ వార్డులో చేర్చారు. అతనికి వైరస్ సోకిందని తెలియకపోవడంతో జలుబు, జ్వరం, కడుపునొప్పి, తలనొప్పు ఫ్లూ లాంటి లక్షణాలే ఉన్నాయని అనుకున్నారు. అందుకే ముందుజాగ్రత్తలు తీసుకోలేదు. కడుపునొప్పి, జ్వరం అంటే…కరోనా అని ఎవరు అనుకొంటారు? డాక్టర్లు సర్జికల్ మాస్క్ లు కూడా వాడకుండా మొదట్లో వైద్యం చేశారంట.
అంతే….వాళ్లందరూ కరోనాకు చిక్కారు. పక్క బెడ్ వాళ్ల పరిస్థితికూడా అంతే. ఇంకోసంగతి.. 10శాతం మంది పేషెంట్లలో కనీసం ఫీవర్ లక్షణాలుకూడా లేవు. కరోనాతో ఇంకో ప్రమాదం ఏంటంటే? కొందరు పేషెంట్స్ నీరసంగా ఉంటారు. వాళ్లకు కరోనా ఉందని ఎవరూ అనుకోరు. వారం దాటితేకాని కరోనా వచ్చిందా రాలేదా? అని చెప్పలేం.
వాళ్లను హాస్సటల్ లో చేర్చుతారు. అక్కడ నుంచి ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. ఇలా మరో ఎనిమిది రోజులు. అందుకే కరోనాను కనిపెట్టడం, అడ్డుకోవడం కష్టమవుతోందని అంటున్నారు వైద్యనిపుణులు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి వూహాన్ నగర ప్రజలకు చైనా నిబంధన విధించింది. ప్రతిరోజూ టెంపరేచర్ ను చూసుకోవాలి. ఏ మాత్రం పెరిగినా హాస్పటిల్ కు రావాలి. కరోనా టెస్ట్ చేయించుకోవాలి.
నెగిటేవ్ వచ్చినా, మరుసటి రోజూ టెంపరేచర్ టెస్ట్ చేసుకోవాల్సిందే. అలాగని టెస్ట్‌ల కోసం హాస్పటల్‌కు వెళ్తే పెద్ద క్యూలు. ఏడెమిది గంటలు పడుతుందని నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే. ఇలా మొదలైంది చైనాకి కరోనా కష్టం.