Islamabad Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి .. అనుమానాస్పద కారును ఆపిన పోలీసు మృతి

ఆత్మాహుతిదాడి ఘటనపై ఇస్లామాబాద్ డీఐజీ సోహైల్ జాఫర్ మాట్లాడుతూ.. ఈ విషాద ఘటన ఉదయం 10.15 గంటల సమయంలో ఐ-10/4 సమీపంలో జరిగిందని తెలిపారు. అనుమానిత క్యాబ్‌ను పోలీసులు వెంబడించి ఆపారని, ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని డీఐజీ తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తితో పాటు, ఓ పోలీసు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.

Islamabad Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి .. అనుమానాస్పద కారును ఆపిన పోలీసు మృతి

Islamabad Car Blast

Updated On : December 23, 2022 / 1:13 PM IST

Islamabad Blast: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ఓ పోలీసుసైతం మరణించాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నగరంలోని ఐ-10 సెక్టార్ పరిధిలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయలు, విశ్వ విద్యాలయం, ఉన్నతస్థాయి మార్కెట్ ప్రాంతాలు ఉన్నాయి.

Bomb Blast : పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

ఆత్మాహుతిదాడి ఘటనపై ఇస్లామాబాద్ డీఐజీ సోహైల్ జాఫర్ మాట్లాడుతూ.. ఈ విషాద ఘటన ఉదయం 10.15 గంటల సమయంలో ఐ-10/4 సమీపంలో జరిగిందని తెలిపారు. అనుమానిత క్యాబ్‌ను పోలీసులు వెంబడించి ఆపారని, ఈ క్యాబ్‌లో మహిళ, మరో వ్యక్తి ప్రయాణిస్తున్నారని గుర్తించడం జరిగిందన్నారు. పోలీసులు కారును తనిఖీ చేస్తున్న క్రమంలో వారు కారునుంచి బయటకు వచ్చారని, అనంతరం యువకుడు కారులో వస్తువులు తీసుకొనేందుకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని డీఐజీ తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయినట్లు డీఐజీ తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళం ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది.

 

ఈ పేలుడు వల్ల పలువురికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. వీరిలోని కొందరు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తిస్థాయి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని ఉగ్రవాద నిరోధక దళం అధికారులు తెలిపారు. గతంలో పాకిస్థాన్ లోని పెషావర్ లోని మసీదులో ఆత్మాహుతి దాడిలో 57మంది మరణించిన విషయం విధితమే.