Super Mario 64 Video Game : పాతికేళ్ల నాటి వీడియో గేమ్.. రూ.11 కోట్లకు అమ్ముడుపోయింది

అదో వీడియో గేమ్. ఇప్పటిది కాదు. పాతికేళ్ల క్రితం నాటిది. చాలా ఓల్డ్. కానీ దాని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా రూ.11కోట్లు పలికింది.

Super Mario 64 Video Game : పాతికేళ్ల నాటి వీడియో గేమ్.. రూ.11 కోట్లకు అమ్ముడుపోయింది

Super Mario 64 Video Game

Updated On : July 12, 2021 / 10:51 PM IST

Super Mario 64 Video Game : అదో వీడియో గేమ్. ఇప్పటిది కాదు. పాతికేళ్ల క్రితం నాటిది. చాలా ఓల్డ్. కానీ దాని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా రూ.11కోట్లు పలికింది.

వీడియో గేమ్ లు, వాటిని ఆడే కన్సోల్స్ తయారీలో నింటెండో సంస్థ(Nintendo 64 console) ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నింటెండో ఓ జపాన్ కంపెనీ. 1977 నుంచి ఈ సంస్థ నుంచి తొలి వీడియో గేమ్ విడుదల కాగా, 80వ దశకం తర్వాత ఈ సంస్థ మార్కెట్ ను శాసించే స్థితికి చేరింది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల ఎలక్ట్రానిక్ మార్కెట్లలోనూ ఎక్కడ చూసినా నింటెండో వీడియో గేములు, గేమింగ్ కన్సోల్స్ కనిపించేవంటే అతిశయోక్తి కాదు.

విషయానికొస్తే… ఈ సంస్థ 1996లో తయారుచేసిన ఓ వీడియో గేమ్ కన్సోల్ ను ఇటీవల వేలం శారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ నింటెండో సూపర్ మారియో-64 గేమింట్ కన్సోల్ ను రూ.11.6 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. అమెరికాలోని టెక్సాస్ హెరిటేజ్ వేలం సంస్థ ఈ వేలం నిర్వహించింది.

నింటెండో సంస్థ తయారు చేసిన సూపర్ మారియో-64 గేమింట్ కన్సోల్ అప్పట్లో అమ్మకాల దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. నింటెండో సంస్థకు బాగా పేరు తెచ్చిపెట్టిన వీడియో గేమింగ్ కన్సోల్స్ లో సూపర్ మారియో-64 ప్రముఖమైంది. మొత్తంగా ప్రపంచంలోనే ఖరీదైన గేమ్ గా ఇది గుర్తింపు పొందింది.