సుప్రీం ‘ఆధార్‌’తీర్పు : కష్టాల్లో మొబైల్ వాలెట్ కంపెనీలు

మొబైల్‌ వాలెట్‌ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 07:17 AM IST
 సుప్రీం ‘ఆధార్‌’తీర్పు : కష్టాల్లో మొబైల్ వాలెట్ కంపెనీలు

Updated On : January 11, 2019 / 7:17 AM IST

మొబైల్‌ వాలెట్‌ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.

ఢిల్లీ : మొబైల్‌ వాలెట్‌ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. వీటిని అమలు చేయడానికి వాలెట్‌ సంస్థలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. అయితే నిర్దేశిత గడువులోగా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 

ప్రైవేటు సంస్థలు కస్టమర్ల నుంచి ఈ–కేవైసీ కోసం ఆధార్‌ను తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాలెట్‌ సంస్థలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. గడువు ముగియడానికి ఇంకా కొన్ని వారాల సమయమే వుండటంతో ఇప్పటిదాకా చాలావరకూ సంస్థలు ముఖ్యంగా మొబిక్విక్, ఫోన్ పే, అమెజాన్ పే, పే జాప్ వంటి పలు కంపెనీలు నానా హైరానా పడుతున్నాయి. ఆధార్ కార్డ్ లేదా అడ్రస్ వెరిఫికేషన్ వంటి ఐడీ కార్డ్ ను మొబైల్స్ కు జత చేయాలని..లేకుండా కంపెనీల ట్రాన్స్ ట్రాక్షన్ నిలిపివేస్తామంటు ఆర్బీఐ 2017 హెచ్చరించింది. కేవలం కొద్ది మంది కస్టమర్ల కేవైసీ మాత్రమే పూర్తి చేయగలిగాయి. దీంతో దాదాపు 95 శాతం మొబైల్‌ వాలెట్లు మార్చి నెల అనంతరం ప్రాసెస్ స్టాప్ చేయాల్సిన పరిస్థితి తలెత్త అవకాశమందని ఆయా సంస్థలు తెలిపాయి. 

ప్రైవేట్‌ కంపెనీలకు ఈ–కేవైసీ అందుబాటులో లేకపోవడంతో.. వీడియో ఆధారిత వెరిఫికేషన్, ఎక్స్‌ఎంఎల్‌ ఆధారిత కేవైసీ వంటి ప్రత్యామ్నాయ విధానాలనైనా అనుమతించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, వీటికి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అధికారికంగా ఆమోదముద్ర లేదు. కాగా మొబైల్‌ వాలెట్‌ సంస్థలన్నీ కూడా కచ్చితంగా కేవైసీ ధ్రువీకరణ జరపాల్సిందేనంటూ 2017లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. దీంతో పలు సంస్థలు ఆధార్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్‌ రూపంలో కేవైసీ వెరిఫికేషన్‌ జరిపాయి. పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కూడా పొందిన పేటీఎం.. బయోమెట్రిక్‌ డాంగిల్స్, ఫీల్డ్‌ ఏజెంట్లను ఉపయోగించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా తెరిచింది. ఈ విధంగా పేటీఎం తమ యూజర్లలో దాదాపు 70 శాతం మందికి పూర్తి స్థాయిలో కేవైసీ నిబంధనలు అమలు చేయగలిగింది. కానీ మిగతా కంపెనీలు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నాయి.