August 15 National Holiday Afghanistan : అఫ్ఘానిస్తాన్ లో ఆగస్టు 15న జాతీయ సెలవు ప్రకటించిన తాలిబాన్ ప్రభుత్వం..ఎందుకో తెలుసా?

భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.

August 15 National Holiday Afghanistan : అఫ్ఘానిస్తాన్ లో ఆగస్టు 15న జాతీయ సెలవు ప్రకటించిన తాలిబాన్ ప్రభుత్వం..ఎందుకో తెలుసా?

August 15 national holiday Afghanistan

Updated On : August 15, 2022 / 7:15 PM IST

August 15 National Holiday Afghanistan : భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీని తాలిబాన్ ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్ లో కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది.

గతేడాది ఆగస్టు 15న అమెరికా దళాలు అఫ్ఘాన్‌ను వీడాయి. అదే సమయంలో తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించారు. తాలిబాన్ల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది కాబూల్ ఎయిర్‌పోర్టుకు దూసుకెళ్లారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లే విమానాలు ఎక్కేందుకు నానా కష్టాలూ పడ్డారు.
Afghanistan: మా దేశానికి తిరిగి రండి..! హిందువులు, సిక్కులను కోరిన తాలిబాన్లు.. ఎందుకంటే?

కొంత మంది విమానం రెక్కలు పట్టుకుని వేలాడుతూ వెళ్లే ప్రయత్నం చేసి కింద పడిపోయి మరణించారు. ఇవన్నీ జరుగుతున్న సమయానికి అఫ్ఘానిస్తాన్.. తాలిబాన్ల వశమైంది. దీనికి గుర్తుగానే తాలిబాన్ ప్రభుత్వం సోమవారం ఆగస్టు15 రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.